బాహుబలిని బీట్ చేసిన రజనీకాంత్

రికార్డుల మీద రికార్డులు సృష్టించిన బాహుబలి సినిమాను బీట్ చేయాలంటే చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తుందని చాలామంది ఊహించారు. కానీ విడుదలకు ముందే బాహుబలి రికార్డును సూపర్ స్టార్ బద్దలుకొట్టాడు. అంతేకాదు… బాహుబలిని మించిన రికార్డుని క్రియేట్ చేశాడు. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం  ‘కబాలి’. ఏప్రిల్‌ 30న విడుదలైన ఈ చిత్ర తమిళ టీజర్‌ ‘బాహుబలి’ ట్రైలర్‌ను బీట్‌ చేసింది. అంతేకాదు… తాజాగా 2 కోట్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ స్వయంగా ప్రకటించింది. ఇంత వరకు దేశంలో ఏ చిత్రానికి దక్కని ఘనత ‘కబాలి’కి దక్కడం గర్వంగా ఉందని పేర్కొంది. పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్‌ థను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్‌ భార్యగా రాధికా ఆప్టే నటించింది. చెన్నైకి చెందిన డాన్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జులై 1న ‘కబాలి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.