Telugu Global
Cinema & Entertainment

పవన్ కల్యాణ్ నితిన్ కు ఫోన్ చేశాడు... కానీ....

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు నితిన్ వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా నితిన్ నటించిన అ..ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కు కూడా పవన్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా పవన్ గురించి నితిన్ మాట్లాడిన విధానం చూస్తే… అతడు ఏ రేంజ్ అభిమానో అందరికీ అర్థమైపోతుంది. అలాంటి అభిమానికి పవన్ ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది… అసలు నితిన్ కు పవన్ ఫోన్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది… అప్పుడు నితిన్ రియాక్షన్ ఏంటి… […]

పవన్ కల్యాణ్ నితిన్ కు ఫోన్ చేశాడు... కానీ....
X

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు నితిన్ వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా నితిన్ నటించిన అ..ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కు కూడా పవన్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా పవన్ గురించి నితిన్ మాట్లాడిన విధానం చూస్తే… అతడు ఏ రేంజ్ అభిమానో అందరికీ అర్థమైపోతుంది. అలాంటి అభిమానికి పవన్ ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది… అసలు నితిన్ కు పవన్ ఫోన్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది… అప్పుడు నితిన్ రియాక్షన్ ఏంటి… ఈ విషయాల్ని నితినే మీడియాతో పంచుకున్నాడు..

అ..ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైమ్ లోనే పవన్ కల్యాణ్ నుంచి నితిన్ కు ఫోన్ వచ్చిందట. దీంతో నితిన్ కు కాళ్లుచేతులు ఆడలేదట. ఒంటినిండా చెమట్లు పట్టేశాయట. ఎలాగోలా కష్టపడి ఆ ఫోన్ ఎత్తాడు. అయితే పవన్ కల్యాణ్ ఫోన్ నుంచి మాట్లాడింది మాత్రం పవన్ కాదు. పవన్ బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ అట. తనను ఆటపట్టించడం కోసమే త్రివిక్రమ్ ఇలా చేశాడని నితిన్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఎన్నో సరదా సన్నివేశాలు, ప్రాక్టికల్ జోక్స్ అ..ఆ షూటింగ్ లో జరిగాయని నితిన్ అంటున్నాడు.

First Published:  29 May 2016 10:36 PM GMT
Next Story