Telugu Global
National

మోడీ ప్రచారంపై సీతారాం ఏచూరి విమర్శలు

ప్రధానమంత్రి మోడీ తన స్థాయిని మరిచి అతిగా ప్రచారం చేసుకుంటున్నారని, ఎక్కువ అవాస్తవాలను నిజాలుగా చెబుతున్నారని సీతారాం ఏచూరి విమర్శించారు. గ్యాస్‌ సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టడం ద్వారా 15 వేల కోట్ల రూపాయాలను ఆదా చేయగలిగామని ప్రధాని చెబుతుండగా అది నిజంకాదని ఈ రెండేళ్లలో 143 కోట్లు మాత్రమే ఆదా చేశారని సీతారాం ఏచూరి పేర్కొన్నారు. గత ఏడాది పేదలకు 3 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చామని ప్రధాని చెబుతుండగా 60 లక్షల కనెక్షన్లు మాత్రమే ఇచ్చారని […]

మోడీ ప్రచారంపై సీతారాం ఏచూరి విమర్శలు
X

ప్రధానమంత్రి మోడీ తన స్థాయిని మరిచి అతిగా ప్రచారం చేసుకుంటున్నారని, ఎక్కువ అవాస్తవాలను నిజాలుగా చెబుతున్నారని సీతారాం ఏచూరి విమర్శించారు. గ్యాస్‌ సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టడం ద్వారా 15 వేల కోట్ల రూపాయాలను ఆదా చేయగలిగామని ప్రధాని చెబుతుండగా అది నిజంకాదని ఈ రెండేళ్లలో 143 కోట్లు మాత్రమే ఆదా చేశారని సీతారాం ఏచూరి పేర్కొన్నారు. గత ఏడాది పేదలకు 3 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చామని ప్రధాని చెబుతుండగా 60 లక్షల కనెక్షన్లు మాత్రమే ఇచ్చారని సీతారాం ఏచూరి అంటున్నారు. ఒక కోటి 65 లక్షల దొంగ రేషన్‌కార్డులను తొలగించామని ప్రధాని చెబుతుండగా 56 లక్షల కార్డులను మాత్రమే తొలగించారని సీతారాం ఏచూరి అంటున్నారు. జన్‌థన్‌ స్కీమ్‌ ప్రారంభించాక మొదటి వంద రోజుల్లో 20 కోట్ల బ్యాంకు ఖాతాలు ప్రారంభించామని ప్రధాని చెబుతుండగా 8 కోట్ల 76 లక్షల బ్యాంక్‌ ఎకౌంట్లు మాత్రమే ప్రారంభించారని సీతారాం ఏచూరి అంటున్నారు.

సీతారాం ఏచూరి ఈ వివరాలను తన ట్విట్టర్‌లో ప్రస్తావించగా బీజేపీ అభిమానులు సీతారాం ఏచూరిపై విరుచుకుపడుతున్నారు. తీవ్రంగా కామెంట్స్‌ చేస్తున్నారు.

First Published:  31 May 2016 5:59 AM GMT
Next Story