Telugu Global
NEWS

ఈ రీసైక్లింగ్‌ నీళ్లు సురక్షితమేనా..?

దక్షిణమధ్య రైల్వే నీటి ఎద్దడిని నివారించడానికి రీసైక్లింగ్‌కు పూనుకుంది. అభినందనీయమే. అయితే రైళ్లు ఫ్లాట్‌ఫారాలమీద ఆగినప్పుడు మన ప్రయాణికులు వద్దన్నా టాయిలెట్స్‌ వాడుతారు. అశుభ్రం అంతా రైల్వే ట్రాక్‌ మీద వుంటుంది. కోచ్‌లలోకి నీళ్లు నింపే సమయంలో కొంత నీరు వృధాగా ట్రాక్‌మీదకు కారిపోతుంది. ఫ్లోర్‌ కడిగినపుడు కొంత నీరు ట్రాక్‌మీదకు చేరుకుంటుంది. బోగీలను శుభ్రం చేసేటప్పుడు కొంత నీరు ట్రాక్‌ మీదకు చేరుతుంది. ఇదంతా డ్రైనేజ్‌లోకి వెళుతుంది. అలా వెళ్లే ఈ నీటిని వృధా కానివ్వకుండా […]

ఈ రీసైక్లింగ్‌ నీళ్లు సురక్షితమేనా..?
X

దక్షిణమధ్య రైల్వే నీటి ఎద్దడిని నివారించడానికి రీసైక్లింగ్‌కు పూనుకుంది. అభినందనీయమే. అయితే రైళ్లు ఫ్లాట్‌ఫారాలమీద ఆగినప్పుడు మన ప్రయాణికులు వద్దన్నా టాయిలెట్స్‌ వాడుతారు. అశుభ్రం అంతా రైల్వే ట్రాక్‌ మీద వుంటుంది. కోచ్‌లలోకి నీళ్లు నింపే సమయంలో కొంత నీరు వృధాగా ట్రాక్‌మీదకు కారిపోతుంది. ఫ్లోర్‌ కడిగినపుడు కొంత నీరు ట్రాక్‌మీదకు చేరుకుంటుంది. బోగీలను శుభ్రం చేసేటప్పుడు కొంత నీరు ట్రాక్‌ మీదకు చేరుతుంది. ఇదంతా డ్రైనేజ్‌లోకి వెళుతుంది. అలా వెళ్లే ఈ నీటిని వృధా కానివ్వకుండా రీసైక్లింగ్‌ యూనిట్‌కు చేరుస్తున్నారు. రోజుకు సుమారు రెండున్నర లక్షల లీటర్ల నీటిని రీసైక్లింగ్‌ చేసి మళ్లీ రైలు కోచ్‌లను, ఫ్లోర్‌లను, పట్టాలను శుభ్రపరచడానికి, మొక్కలకు వాడుతున్నారు.

అయితే మన రీసైక్లింగ్‌ యూనిట్లు ఉన్నతప్రమాణాలను పాటించవు. మానవవ్యర్ధాలతో కలిసిన నీళ్లు సరిగా రీసైక్లింగ్‌ కాకుండా ఫ్లాట్‌ఫారాల శుభ్రతకు, కోచ్‌లను కడగడానికి ఏమేరకు ఆరోగ్యకరమొ అధికారులు ఆలోచించాలి. ఈ నీటిని వృధా కానివ్వకుండా చూడాలనుకోవడం చాలా మంచి ప్రయత్నమే. అయితే ఆ నీటిని రైల్వే ట్రాక్‌లను కడగడానికి, మొక్కలకు ఉపయోగిస్తే మంచిది. రీసైక్లింగ్‌ మంచిగా లేకపోయినా నష్టంలేదు. ప్రయాణికుల ఆరోగ్యానికి హానికరం కాదు.

First Published:  31 May 2016 12:03 AM GMT
Next Story