Telugu Global
Cinema & Entertainment

రూటు మార్చిన రాజమౌళి కొడుకు

రాజమౌళి తనయుడు కార్తికేయ గురించి అప్పుడప్పుుడు వార్తలు వింటూనే ఉన్నాం. రాజమౌళి చేసే ప్రతి సినిమాకు ఏదో ఒక విభాగంలో కార్తికేయ పనిచేస్తాడు. బాహుబలి సినిమాకు కూడా ప్రొడక్షన్ లో పనిచేశాడు. టీజర్ మేకింగ్ లో పాల్గొన్నాడు. ప్రమోషన్ లో కూడా తన మార్క్ చూపించాడు. సో… జక్కన్న కొడుకు మెగాఫోన్ పట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ఆ మధ్య రూమర్లు వచ్చాయి. ఆ పుకార్లకు మరింత బలం చేకూరుస్తూ… ఎన్టీఆర్ తో కార్తికేయ ఓ సినిమా […]

రూటు మార్చిన రాజమౌళి కొడుకు
X
రాజమౌళి తనయుడు కార్తికేయ గురించి అప్పుడప్పుుడు వార్తలు వింటూనే ఉన్నాం. రాజమౌళి చేసే ప్రతి సినిమాకు ఏదో ఒక విభాగంలో కార్తికేయ పనిచేస్తాడు. బాహుబలి సినిమాకు కూడా ప్రొడక్షన్ లో పనిచేశాడు. టీజర్ మేకింగ్ లో పాల్గొన్నాడు. ప్రమోషన్ లో కూడా తన మార్క్ చూపించాడు. సో… జక్కన్న కొడుకు మెగాఫోన్ పట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ఆ మధ్య రూమర్లు వచ్చాయి. ఆ పుకార్లకు మరింత బలం చేకూరుస్తూ… ఎన్టీఆర్ తో కార్తికేయ ఓ సినిమా చేసే అవకాశముందంటూ కథనాలు కూడా వచ్చాయి. అయితే కార్తికేయ మాత్రం రూటు మార్చినట్టు కనిపిస్తోంది. మెగాఫోన్ కంటే మిగతావిషయాలపైనే ఎక్కువ దృష్టిపెడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రమోషన్ కంపెనీని ఏర్పాటుచేసిన కార్తికేయ… తాజాగా హోటల్ బిజినెస్ లోకి కూడా ఎంటరయ్యాడు. సర్క్యూట్ పేరుతో కొండాపూర్ వైట్ ఫీల్డ్స్ దగ్గర్లో ఓ రెస్టారెంట్ ప్రారంభించాడు. దీనికి సంబంధించి సినీప్రముఖులతో ప్రమోషన్ కూడా షురూ చేయించాడు. తమ రెస్టారెంట్ లో రొయ్యల బిరియానీ, రవ్వ దోవ కేక అంటూ ఊరిస్తున్నాడు. మొత్తానికి కెరీర్ విషయంలో రాజమౌళి తన కొడుక్కి ఫుల్లు ఫ్రీడమ్ ఇచ్చినట్టే కనిపిస్తోంది.
First Published:  31 May 2016 11:11 PM GMT
Next Story