Telugu Global
WOMEN

1098కి ఫోన్ చేసి...బాల్య వివాహాన్ని త‌ప్పించుకుంది!

ప‌ద‌వ‌త‌ర‌గ‌తిలో 9 గ్రేడ్ మార్కులు సాధించిన ఒక బాలిక‌, తాత‌, త‌న‌కు పెళ్లి చేయ‌బోగా చాక‌చ‌క్యంగా త‌ప్పించుకుంది. ప్ర‌కాశం జిల్లా, కొత్త ప‌ట్నం స‌మీపంలోని ఏట‌ముక్క‌ల గ్రామంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. తండ్రి మ‌ర‌ణించ‌డం, త‌ల్లి వ‌దిలేయ‌టంతో ఆ బాలిక త‌న తాత వ‌ద్ద పెరుగుతోంది. చ‌దువుప‌ట్ల శ్ర‌ద్ధ ఉన్న ఆమె గ‌త ప‌రీక్ష‌ల్లో ప‌ద‌వ‌త‌ర‌గ‌తి మంచి మార్కుల‌తో పాస‌య్యింది. ఇంకా చ‌దువుకోవాల‌నే ఆశ‌తో ఉంది. కానీ ఆమె తాత మాత్రం, ఆమె ఇష్టానికి వ్య‌తిరేకంగా పెళ్లి […]

ప‌ద‌వ‌త‌ర‌గ‌తిలో 9 గ్రేడ్ మార్కులు సాధించిన ఒక బాలిక‌, తాత‌, త‌న‌కు పెళ్లి చేయ‌బోగా చాక‌చ‌క్యంగా త‌ప్పించుకుంది. ప్ర‌కాశం జిల్లా, కొత్త ప‌ట్నం స‌మీపంలోని ఏట‌ముక్క‌ల గ్రామంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. తండ్రి మ‌ర‌ణించ‌డం, త‌ల్లి వ‌దిలేయ‌టంతో ఆ బాలిక త‌న తాత వ‌ద్ద పెరుగుతోంది. చ‌దువుప‌ట్ల శ్ర‌ద్ధ ఉన్న ఆమె గ‌త ప‌రీక్ష‌ల్లో ప‌ద‌వ‌త‌ర‌గ‌తి మంచి మార్కుల‌తో పాస‌య్యింది. ఇంకా చ‌దువుకోవాల‌నే ఆశ‌తో ఉంది. కానీ ఆమె తాత మాత్రం, ఆమె ఇష్టానికి వ్య‌తిరేకంగా పెళ్లి నిశ్చ‌యం చేశాడు. పెళ్లిని త‌ప్పించుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన ఆ బాలిక త‌న ప్రెండ్‌తో చైల్డ్ హెల్ప్‌లైన్ నెంబ‌ర్ 1098 కి కాల్ చేయించింది. ఫోన్ కాల్‌ అనంత‌రం ఒక సామాజిక కార్య‌క‌ర్త‌ల బృందం బాలిక‌ను చేరుకున్నారు. ఆమె వివాహాన్ని ఆప‌డ‌మే కాకుండా, బాలిక‌కు 18ఏళ్ల లోపు పెళ్లి ప్ర‌య‌త్నాలు చేయ‌న‌ని ఆమె తాత వ‌ద్ద మాట తీసుకున్నారు. ప‌శువుల డాక్ట‌రు కావాల‌ని అనుకుంటున్న ఆ అమ్మాయి చ‌దువుకి స‌హాయం చేస్తామ‌ని… తాము హామీ ఇచ్చిన‌ట్టుగా సామాజిక కార్య‌క‌ర్త‌ల్లో ఒక‌రిగా వ‌చ్చిన హెల్ప్ ఎన్‌జిఓకి చెందిన బి.వి.సాగ‌ర్ తెలిపారు.

First Published:  2 Jun 2016 6:33 AM GMT
Next Story