జగన్ త్వరలో కోమాలోకి వెళ్తాడు-పయ్యావుల… జరగరానిది జరిగితే మాకు సంబంధం లేదు- సునీత

చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి పరిటాల సునీత,ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ కాస్త విచిత్రంగా స్పందించారు. జగన్‌ను ప్రజలే కాదు దేవుడు కూడా క్షమించరని సునీత చెప్పారు. జగన్‌కు పోయేకాలంవచ్చిందన్నారు. జగన్ వ్యాఖ్యల వల్ల జరగకూడనిది ఏదైనా జరిగితే తమకు సంబంధం లేదని హెచ్చరించారు. ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న పరిటాల సునీత ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు అనంతపురం జిల్లాకే చెందిన పయ్యావుల కేశవ్ కూడా ఇదే తరహాలో మాట్లాడారు. జగన్‌ త్వరలోనే కోమాలోకి వెళ్తారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జగన్ డిప్రెషన్‌లో ఉన్నారన్నారు. చంద్రబాబును తిడితే జగన్‌ను రైతులు రాళ్లతో, మహిళలు చీపుర్లతో, వృద్దులు కర్రలతో కొడుతారని హెచ్చరించారు. జగన్‌ను రాష్ట్ర పొలిమేరల వరకు తరిమేస్తామన్నారు. రాష్ట్రం జగన్ అబ్బ జాగీరు కాదన్నారు. చంద్రబాబు మంచితనం వల్లే జగన్ ఈ రాష్ట్రంలో బతకగలుగుతున్నారని పయ్యావుల అన్నారు.

Click on Image to Read:

ap-employees

YS-Jagan

Poonam-Mahajan-1

jogi-ramesh-comments-on-bal

jagan-yatra

Ashok-gajapathi-raju-Appar

jc-prabhakar-reddy

muddu-krishnama-naidu

renuka-chowdary

KE-Prabhakar-1

babu-purandeshwari

damodar-raja-narasimha

ashok-gajapati-raju

dgp-ramudu-paritala-sriram