Telugu Global
Cinema & Entertainment

"శ్రీ‌శ్రీ‌" సినిమా రివ్యూ

రేటింగ్: 2.5/5 న‌టీ న‌టులు:  కృష్ణ‌, విజ‌య నిర్మాల‌, న‌రేష్,  సాయికుమార్,  అంగ‌న‌రాయ్ తదితరులు ద‌ర్శ‌క‌త్వం: ముప్ప‌ల నేని శివ‌ సంగీతం: ఇఎస్ మూర్తి             ప‌ది సంవత్స‌రాల గ్యాప్ త‌రువాత సూప‌ర్ స్టార్ కృష్ణ మేక‌ప్ వేసుకున్నారు.వాస్త‌వంగా  విశ్రాంతి  ద‌శ‌లో  ఆయ‌న మేక‌ప్ వేసుకోవ‌డం ఒక విశేషం.  ఏడు ప‌దుల వ‌య‌సుకు ద‌గ్గ‌ర‌గా వున్నా  కృష్ణను మ‌ళ్లీ  మేక‌ప్ వేసి తీసుకొస్తున్నారంటే..ఆయ‌న అభిమానుల్లో కొద్ది పాటి అంచ‌నాలు ఉండోచ్చు.   మ‌రి  ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కుడిగా  మూడు ప‌ద‌ల‌కు పైగా అనుభ‌వం వున్న  ముప్ప‌ల […]

శ్రీ‌శ్రీ‌ సినిమా రివ్యూ
X

రేటింగ్: 2.5/5
న‌టీ న‌టులు: కృష్ణ‌, విజ‌య నిర్మాల‌, న‌రేష్, సాయికుమార్, అంగ‌న‌రాయ్ తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: ముప్ప‌ల నేని శివ‌
సంగీతం: ఇఎస్ మూర్తి

ప‌ది సంవత్స‌రాల గ్యాప్ త‌రువాత సూప‌ర్ స్టార్ కృష్ణ మేక‌ప్ వేసుకున్నారు.వాస్త‌వంగా విశ్రాంతి ద‌శ‌లో ఆయ‌న మేక‌ప్ వేసుకోవ‌డం ఒక విశేషం. ఏడు ప‌దుల వ‌య‌సుకు ద‌గ్గ‌ర‌గా వున్నా కృష్ణను మ‌ళ్లీ మేక‌ప్ వేసి తీసుకొస్తున్నారంటే..ఆయ‌న అభిమానుల్లో కొద్ది పాటి అంచ‌నాలు ఉండోచ్చు. మ‌రి ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కుడిగా మూడు ప‌ద‌ల‌కు పైగా అనుభ‌వం వున్న ముప్ప‌ల నేని శివ శ్రీశ్రీ చిత్రాన్ని ఎలా మ‌లిచారు. ఈ జ‌న‌రేష‌న్ ఫ్యాన్స్ కు న‌చ్చుతుందా… ఆ విశేషాలన్నీ శ్రీ‌శ్రీ రివ్యూ లో చూద్దాం ..

క‌థ
అడివికి దగ్గరగా ఉన్న పోతురాజుగూడెం ప్రజలు అక్కడ ఉన్న ఫ్యాక్టరీల నుండి వచ్చే దుమ్ము దూళితో రోగాన పడుతుంటారు. ఇక అక్కడ ఉన్న డాక్టర్ కూడా అమ్మాయిల పిచ్చి వాడు. కనీసం ఆర్.ఎం.పి కూడా కాని భిక్షపతి (పోసాని కృష్ణ మురళి)ని మెడికల్ ఆఫీసర్ చేస్తాడు జె.కె భరద్వాజ్ (మురళి శర్మ). తన పలుకుబడితో అక్కడ ఎన్ని ప్రాణాలు పోతున్నా తన ల్యాబ్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాడు. అయితే అలాంటి దుశ్చర్యలు చేస్తున్న పోతురాజుగూడెం ప్రజల గోడుకు గొంతుగా మారే ప్రయత్నం చేస్తుంది శ్రీపాదం శ్రీనివాస్ రావు (కృష్ణ) అలియాస్ శ్రీ శ్రీ కూతురు శ్వేత (అంగన రాయ్).

ఈ సినిమా అంత‌టికి బ‌ల‌మైన పాయింట్. శ్వేత ను విల‌న్ గ్యాంగ్ చంప‌డం. స‌మాజం ప‌ట్ల బాధ్య‌త‌.. వృత్తి ప‌ట్ల అంకిత భావం వున్న అమ్మాయి. ఒక గ్రామాని మింగేస్తున్న దుష్ట చ‌తుష్ట‌యం దుర్మార్గాల్ని బ‌య‌ట పెట్ట‌డానికి త‌న ప్రాణాల్ని కోల్పోతుంది. కూతురు మ‌ర‌ణంతో క‌ల‌త చేందిన శ్రీ‌పాదం శ్రీ‌నివాస్ రావు అలియాస్ సూప‌ర్ స్టార్ కృష్ణ చేసిన అంతిమ పోరాట‌మే ఈ చిత్ర క‌థ‌నం.

నటీనటుల ప్రతిభ
సూపర్ స్టార్ కృష్ణ గోల్డెన్ జూబ్లీ ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మరోసారి తన అభిమానుల కోసం ఓ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. తన వయసుకి తగ్గ పాత్రలో తన కూతురు అన్యాయానికి బలైందనే బాధతో ఓ వైపు కుమిలిపోతూనే మరో వైపు చంపిన వారి మీద కక్ష్య సాధించే పాత్రలో అద్భుతంగా నటించారు నటశేఖర కృష్ణ. ఎన్నో వందల సినిమాలు చేసినా ప్రస్తుత సినిమా తన కొత్త సినిమాలా ఫీల్ అవుతూ తన గ్రేస్ చూపించారు కృష్ణ. అయితే వయసు మీద పడటం వల్ల ఎక్కువగా స్టాండింగ్ డైలాగ్స్ కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. శ్రీ శ్రీగా కృష్ణ మరోసారి అద్భుతంగా నటించారు.. ఇక సుమతిగా నటించిన విజయ నిర్మల కూడా తన సహజ నటనను మరోసారి ప్రదర్శించారు. సినిమాలో కృష్ణ , విజయ నిర్మల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి.

ఇక శ్రీ శ్రీ లో ఏ.సి.పి అజయ్ కుమార్ గా సీనియర్ హీరో నరేష్ ఓ ఫుల్ లెంథ్ పాత్రలో నటించి మెప్పించారు. మర్డర్ మిస్టరీని కనిపెట్టే ప్రయత్నంలో నరేష్ పోతు రాజు గూడెం వెళ్లి అక్కడ సూర్య (సాయి కుమార్) ను కలిసినప్పుడు వచ్చే సన్నివేశాల్లో గొప్పగా నటించాడు. ఇక సినిమాలో మరో విశేషం ఏంటంటే తన కెరియర్ లో ఇంతవరకు తన తల్లి విజయనిర్మలతో కలిసి నటించే అవకాశం దక్కించుకుని దానికి నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు నరేష్. ఇక సూర్యగా తిరుగుబాటు దారుడిగా మరోసారి తన సత్తా చాటాడు సాయి కుమార్. ఆయన డైలాగుల్లోని పవర్ సినిమా కాన్సెప్ట్ ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు
ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా దర్శకుడు అనుకున్న పాయింట్ పాతదే అయినా దాన్ని తెర రూపం దాల్చే విషయంలో లోటు పాట్లు చేశాడు. సినిమా సంగీతం అందించిన ఈ.ఎస్.మూర్తి పర్వాలేదనిపించుకున్నాడు. సినిమాటోగ్రాఫర్ సతీష్ ముత్యాల ఓకే అనిపించుకోగా ఎడిటర్ రమేష్ సినిమా ఎడిటింగ్ ఇంకాస్త మంచిగా చేసి ఉండే బాగుండేది. సినిమా కథను అనుకున్న విధంగా తీసేందుకు కావాల్సిన స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చేందుకు నిర్మాత సాయి దీప్ చట్ల కూడా సహకరించాడు.

చిత్ర విశ్లేషణ
ఇక సినిమా కథ కథనాలు అన్ని బాగానే ఉన్నా సినిమా కేవలం కృష్ణ గారిని అభిమానించే వారికి.. ఇక ఘట్టమనేని ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చే అవకాశాలున్నాయి. సమాజంలో దుర్మార్గులు వచ్చిన ప్రతిసారి వారిని ఎదురించేందుకు ఎప్పుడు ఓ శ్రీ శ్రీ వస్తాడన్న డైలాగ్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. దర్శకుడు కథలో కొంత క్లారిటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇక స్క్రీన్ ప్లే కూడా మొదటి భాగంలో ఆమె క్యారక్టర్ ను చంపేసి మరళ అదే ఫ్లాష్ బ్యాక్ సెకండాఫ్ లో ముందునుండి కంటిన్యూ చేయడం జరుగుతుంది. అయితే ఆడియెన్స్ అప్పటికే శ్వేతను చంపేసిన ఎపిసోడ్ చూసుండటం వల్ల సెకండ్ హాఫ్ సీన్స్ కాస్త బోర్ అనిపిస్తాయి. వాణిజ్య అంశాలు త‌క్కువుగా ఉండ‌టం .. ప్రొగ్రెసివ్ అవుట్ లుక్ ఎక్కువుగా ఉండ‌టం ..ఇప్ప‌టి ఫేస్ బుక్, ట్విట‌్టర్ జన‌రేష‌న్ కు క‌నెక్ట్అయ్యే విధంగా సినిమా లేక పోవ‌డం మైన‌స్ అనిపిస్తాయి.

First Published:  3 Jun 2016 7:04 AM GMT
Next Story