Telugu Global
Cinema & Entertainment

మంజులతో సినిమా పుకారు మాత్రమే...

కృష్ణ కూతురు, మహేష్ బాబు సోదరి, నిర్మాత మంజులతో నాని ఓ సినిమా చేస్తాడంటూ ఈమధ్య చాలా ప్రచారం జరిగింది. నాని సినిమాతో మంజుల దర్శకురాలిగా కూడా మారబోతోందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజంలేదని తాజాగా తేలింది. ఈ విషయాన్ని మంజుల స్వయంగా ప్రకటించారు. నానితో తను ఎలాంటి సినిమా చేయడం లేదని స్పష్టంచేసిన మంజుల… అసలు తనకు దర్శకత్వం వైపు వెళ్లే ఆలోచన కూడా లేదని కుండబద్దలుకొట్టారు. మరోవైపు హీరో […]

మంజులతో సినిమా పుకారు మాత్రమే...
X
కృష్ణ కూతురు, మహేష్ బాబు సోదరి, నిర్మాత మంజులతో నాని ఓ సినిమా చేస్తాడంటూ ఈమధ్య చాలా ప్రచారం జరిగింది. నాని సినిమాతో మంజుల దర్శకురాలిగా కూడా మారబోతోందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజంలేదని తాజాగా తేలింది. ఈ విషయాన్ని మంజుల స్వయంగా ప్రకటించారు. నానితో తను ఎలాంటి సినిమా చేయడం లేదని స్పష్టంచేసిన మంజుల… అసలు తనకు దర్శకత్వం వైపు వెళ్లే ఆలోచన కూడా లేదని కుండబద్దలుకొట్టారు. మరోవైపు హీరో నాని కూడా ఈ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం జెంటిల్ మేన్ సినిమా చేస్తున్న నాని… ఈ సినిమా తర్వాత దిల్ రాజు బ్యానర్ లో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈనెల 17న జెంటిలమేన్ విడుదలవుతుంది. ఆ వెంటనే దిల్ రాజు ప్రాజెక్టుకు షిఫ్ట్ అవుతాడు నాని. అంతేతప్ప… మంజులతో ఎలాంటి సినిమాకు కమిట్ అవ్వలేదని స్పష్టంచేశాడు. మరోవైపు మంజుల కథ చెబితే ఓకేనా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన నాని… కథ, కథనం బాగుంటే మంజుల దర్శకత్వంలో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. గతంలో నందినిరెడ్డి దర్శకత్వంలో అలా మొదలైంది సినిమా చేశాడు నాని. నందిని రెడ్డికి అదే మొదటి సినిమా. సో… మంజులతో కలిసి వర్క్ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని… కాకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని నాని స్పష్టంచేశాడు.
First Published:  3 Jun 2016 11:31 PM GMT
Next Story