Telugu Global
NEWS

తెలంగాణ‌లో మ‌రో ఉద్య‌మం!

తెలంగాణ‌లో మ‌రో పోరుకు స‌మ‌ర శంఖం పూరించారు న్యాయ‌వాదులు. హైకోర్టు విభ‌జ‌న వెంట‌నే చేప‌ట్టాలన్న ప్ర‌ధాన డిమాండ్‌తో వీరు పోరుబాట ప‌ట్ట‌నున్నారు. ఈ నెల 13 నుంచి తెలంగాణ‌లోని రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో సేవ‌ల‌కు  దూరంగా ఉండాల‌ని తెలంగాణ  బార్ అసోసియేష‌న్ నిర్ణ‌యించింది. ఉమ్మ‌డి హైకోర్టు జ‌రిపిన న్యాయాధికారుల ప్రొవిజ‌న‌ల్ కేటాయింపులు పార‌ద‌ర్శ‌కంగా లేవ‌న్న‌ది వీరి మ‌రో వాద‌న‌. దీనికి నిర‌స‌న‌గా ఈనెల 13న ప‌లు నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు పిలుపునిచ్చాయి. చ‌లో హైకోర్టు,  లంచ్ అవ‌ర్లో న్యాయ‌శాఖ […]

తెలంగాణ‌లో మ‌రో ఉద్య‌మం!
X
తెలంగాణ‌లో మ‌రో పోరుకు స‌మ‌ర శంఖం పూరించారు న్యాయ‌వాదులు. హైకోర్టు విభ‌జ‌న వెంట‌నే చేప‌ట్టాలన్న ప్ర‌ధాన డిమాండ్‌తో వీరు పోరుబాట ప‌ట్ట‌నున్నారు. ఈ నెల 13 నుంచి తెలంగాణ‌లోని రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో సేవ‌ల‌కు దూరంగా ఉండాల‌ని తెలంగాణ బార్ అసోసియేష‌న్ నిర్ణ‌యించింది. ఉమ్మ‌డి హైకోర్టు జ‌రిపిన న్యాయాధికారుల ప్రొవిజ‌న‌ల్ కేటాయింపులు పార‌ద‌ర్శ‌కంగా లేవ‌న్న‌ది వీరి మ‌రో వాద‌న‌. దీనికి నిర‌స‌న‌గా ఈనెల 13న ప‌లు నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు పిలుపునిచ్చాయి. చ‌లో హైకోర్టు, లంచ్ అవ‌ర్లో న్యాయ‌శాఖ ఉద్యోగులు, న్యాయాధికారులు న‌ల్ల‌రిబ్బ‌న్ల‌తో నిర‌స‌న తెల‌ప‌డం, బార్ అసోసియేష‌న్ తీర్మానం ప్ర‌కారం… అంద‌రూ ఒకే రోజులో సెల‌వులో వెళ్ల‌డం వంటివి ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో ఉన్నాయి.
హైకోర్టు విభ‌జ‌నే ప్ర‌ధాన ధ్యేయంగా ముందుకెళుతున్నారు తెలంగాణ న్యాయ‌వాదులు, జ‌డ్జీలు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోనూ న్యాయ‌వాదుల‌ది కీల‌క పాత్ర అన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో గ‌త ప‌రిణామాలు పున‌రావృతం కాకుండా ఉండ‌రాద‌ని తెలుస్తోంది. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో స్థానికేత‌రులు గో బ్యాక్ అంటూ చేసిన ఉద్య‌మం ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీయ‌డంతో న్యాయ‌వాదులపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈసారి గ‌తంలో జ‌రిగిన‌ట్లుగా కాకుండా.. పూర్తిగా శాంతియుతంగా నిర‌స‌న‌లు తెల‌పాల‌ని తెలంగాణ బార్ అసోసియేష‌న్ తీర్మానించింది. వీరికి ప‌లువురు మేధావులు కూడా మ‌ద్ద‌తు తెలిపారు.
First Published:  6 Jun 2016 1:01 AM GMT
Next Story