Telugu Global
Cinema & Entertainment

అమెరికా లో  కాసుల వ‌ర్షం కురిపిస్తున్న అఆ..!

అక్క‌డ మ‌న జ‌నాభా త‌క్కువే. కానీ టికెట్ ధ‌ర ఎక్కువ‌.  అదే ఎన్ ఆర్ ఐ మార్కెట్ లేదా ఓవ‌ర్సీస్ మార్కెట్. టాలీవుడ్ ద‌ర్శ‌కుల్లో   ఓవ‌ర్సీస్ లో  మంచి డిమాండ్ వున్న  డైరెక్ట‌ర్ అంటే త్రివిక్ర‌మ్ అనే చెప్పాలి.  వెంక‌టేష్ మ‌ల్లీశ్వ‌రి చిత్రం   నుంచి ఆయ‌న చేస్తున్న ప్ర‌తి సినిమా అక్క‌డ వ‌సూళ్లు  రాబ‌ట్ట‌డంలో ఫెయిల్ కాలేదు.  తాజాగా  నితిన్, స‌మంత  లీడ్  రోల్స్ లో చేసిన   అఆ చిత్రం కూడా  4 రోజుల్లో  దాదాపు 10 […]

అమెరికా లో  కాసుల వ‌ర్షం కురిపిస్తున్న అఆ..!
X

అక్క‌డ మ‌న జ‌నాభా త‌క్కువే. కానీ టికెట్ ధ‌ర ఎక్కువ‌. అదే ఎన్ ఆర్ ఐ మార్కెట్ లేదా ఓవ‌ర్సీస్ మార్కెట్. టాలీవుడ్ ద‌ర్శ‌కుల్లో ఓవ‌ర్సీస్ లో మంచి డిమాండ్ వున్న డైరెక్ట‌ర్ అంటే త్రివిక్ర‌మ్ అనే చెప్పాలి. వెంక‌టేష్ మ‌ల్లీశ్వ‌రి చిత్రం నుంచి ఆయ‌న చేస్తున్న ప్ర‌తి సినిమా అక్క‌డ వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంలో ఫెయిల్ కాలేదు. తాజాగా నితిన్, స‌మంత లీడ్ రోల్స్ లో చేసిన అఆ చిత్రం కూడా 4 రోజుల్లో దాదాపు 10 కోట్లు రాబ‌ట్టిన‌ట్లు..ప్ర‌ముఖ ట్రేడ్ ఎన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్స్ ట్విట్ చేశారు. మ‌రి వ‌ర‌స‌గా రెండు వారాలు సినిమా ర‌న్ అయితే ఏ రేంజ్ లో క‌లెక్ష‌న్స్ వ‌స్తాయో. ఇక గుర‌వారం నుంచి ఆది వారం వ‌ర‌కు అఆ చిత్రం క‌లెక్ష‌న్స్ ఉభ‌య తెలుగు రాష్ట్ర‌ల్లో 30 కోట్లు దాటిన‌ట్లు తెలుస్తుంది. ఆల్మోస్ట్ మొద‌టి వారం పూర్తి అయ్యేలోపే బ‌య్య‌ర్లు లాభ‌ల్లో ఉంటార‌న‌డంలో సందేహాం లేదు మ‌రి.

First Published:  6 Jun 2016 5:02 AM GMT
Next Story