Telugu Global
NEWS

రెండు రోజుల్లో మరో వికెట్ పడగొడుతాం " జలీల్‌ ఖాన్

టీడీపీ నేత అయిన వైసీపీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్… తాను గెలిచిన పార్టీని విమర్శించడంలో చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో అందరి కంటే తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైసీపీకి మరో హెచ్చరిక చేశారాయన. తమ నేత చంద్రబాబును విమర్శించిన ప్రతిసారి వైసీపీలో ఒక వికెట్ పడుతుందని చెప్పారు. చంద్రబాబును విమర్శించకపోవడం వైసీపీకే మంచిదని మాట్లాడారు. రెండు రోజుల్లో చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి వికెట్ కూడా పడుతుందని జలీల్‌ ఖాన్ చెప్పారు. […]

రెండు రోజుల్లో మరో వికెట్ పడగొడుతాం  జలీల్‌ ఖాన్
X

టీడీపీ నేత అయిన వైసీపీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్… తాను గెలిచిన పార్టీని విమర్శించడంలో చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో అందరి కంటే తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైసీపీకి మరో హెచ్చరిక చేశారాయన. తమ నేత చంద్రబాబును విమర్శించిన ప్రతిసారి వైసీపీలో ఒక వికెట్ పడుతుందని చెప్పారు. చంద్రబాబును విమర్శించకపోవడం వైసీపీకే మంచిదని మాట్లాడారు. రెండు రోజుల్లో చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి వికెట్ కూడా పడుతుందని జలీల్‌ ఖాన్ చెప్పారు. చంద్రబాబును పదేపదే విమర్శిస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు.

టీడీపీపై చేస్తున్న విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని వారే వైసీపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. అయినా సీఎంను విమర్శించడం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చేసే సాధారణ చర్యే. దానికి కూడా ప్రతీకారం తీర్చుకుంటామని పబ్లిక్‌గా చెప్పుకునే స్థాయికి ఏపీ రాజకీయాలను చేర్చారన్న మాట. ఎమ్మెల్యేలను గోడ దూకించడం కూడా జలీల్‌ ఖాన్ లాంటి వారి దృష్టిలో రాచకార్యంలాగే ఉంది కాబోలు. అయినా టీడీపీ నేతల కంటే ఎక్కువగా చంద్రబాబుకోసం పోరాడుతున్న జలీల్‌ఖాన్ బాధను పచ్చపార్టీ అధినేత ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో!.

Click on Image to Read:

lokesh-kommineni

roja

ravanth-reddy

ganta-china-rajappa

kavitha

kcr

kodandaram

mudragaa-1123

komati-reddy

kodandaram1

ysrcp-chittor-mla

chandrababu-naidu

bhumana

anam-ramanarayana-reddy

buggana rajendranath reddy

tdp-leaders

satya-nadella

employee-murali-krishna

ashok-babu

jagan-anantapur

First Published:  7 Jun 2016 7:20 AM GMT
Next Story