Telugu Global
Cinema & Entertainment

ఈనెల లోనే మహేష్ బాబు కొత్త సినిమా... బడ్జెట్ లో భారీ కోత‌

మహష్ బాబు కొత్త సినిమాకు సంబంధించి అప్ డేట్స్ వచ్చేశాయి. ఈనెలలోనే మహేష్ బాబు-మురుగదాస్ కొత్త సినిమా ప్రారంభమౌతుంది. అంతేకాదు… హీరోయిన్ గా పరిణీతి చోప్రాను కూడా దాదాపు ఖరారు చేసినట్టే. బ్రహ్మోత్సవం ఇలా ఫ్లాప్ అయిన వెంటనే.. అలా లండన్ చెక్కేసిన మహేష్… తన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన సంగతుల్ని అక్కడ్నుంచే చక్కబెట్టడం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే మురుగదాస్ సినిమాకు డేట్ ఫిక్స్ చేశాడని తెలుస్తోంది. ఈ నెల మూడో వారంలో మహేష్ సినిమా సెట్స్ […]

ఈనెల లోనే మహేష్ బాబు కొత్త సినిమా... బడ్జెట్ లో భారీ కోత‌
X

మహష్ బాబు కొత్త సినిమాకు సంబంధించి అప్ డేట్స్ వచ్చేశాయి. ఈనెలలోనే మహేష్ బాబు-మురుగదాస్ కొత్త సినిమా ప్రారంభమౌతుంది. అంతేకాదు… హీరోయిన్ గా పరిణీతి చోప్రాను కూడా దాదాపు ఖరారు చేసినట్టే. బ్రహ్మోత్సవం ఇలా ఫ్లాప్ అయిన వెంటనే.. అలా లండన్ చెక్కేసిన మహేష్… తన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన సంగతుల్ని అక్కడ్నుంచే చక్కబెట్టడం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే మురుగదాస్ సినిమాకు డేట్ ఫిక్స్ చేశాడని తెలుస్తోంది. ఈ నెల మూడో వారంలో మహేష్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఈ సినిమా షూటింగ్ ను పాటలతో ప్రారంభించాలని నిర్ణయించారు. తమిళ సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్… ఇప్పటికే ఈ సినిమా కోసం 3 పాటల్ని కంపోజ్ చేశాడు. వీటిలో ఒక పాటను మహేష్ బాబు కూడా ఓకే చెప్పాడు. ఆ పాటతోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ షూటింగ్ కోసం అన్నపూర్ణ స్టుడియోస్ లో భారీ సెట్ నిర్మించే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మహేష్ ఈ సినిమాలో ఇంటలిజెన్స్ ఏజెండ్ గా కనిపిస్తాడనే టాక్ నడుస్తోంది. గతంలో మురుగదాస్ దర్శకత్వం వహించిన తుపాకి సినిమాలో హీరో విజయ్ ఇదే తరహా పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇప్పుడు మహేష్ కూడా దాదాపు అదే ఛాయలున్న పాత్రను పోషిస్తాడని తెలుస్తోంది. సమాజంలో అన్యాయం కనిపిస్తే చూస్తూ ఊరుకోలోని టిపికల్ క్యారెక్టరైజేషన్ తో మహేశ్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. వచ్చే వారంలో సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. బ్రహ్మోత్సవం దెబ్బతో… దాదాపు 85కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే బడ్జెట్ లో భారీ కోత విధించిన విషయం తెలిసిందే.

First Published:  7 Jun 2016 12:27 AM GMT
Next Story