రామ్ చరణ్ – రకుల్ మధ్య ఏం నడుస్తోంది…?

గతంలో కాజల్ ను వద్దంటే రిపీట్ చేశాడు. వరుసగా ఆమెకే అవకాశాలిచ్చాడు. మగధీర చరిత్ర సృష్టించింది కాబట్టి… ఆ సెంటిమెంట్ కొద్దీ కాజల్ కు వరుసగా అవకాశాలు ఇస్తున్నాడని పోనీలే అంటూ అంతా సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా చెర్రీ అలానే వరుసగా అవకాశాలు ఇస్తున్నాడు. అలా అని రకుల్ ప్రీత్ సింగ్ చెర్రీకి కలిసొచ్చిన హీరోయిన్ కాదు. బ్రూస్ లీ లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయినప్పటికీ ఆమెను తీసుకొచ్చి తన నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకున్నాడు చరణ్. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగే హీరోయిన్ గా నటిస్తోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రకుల్ కు అవకాశమిచ్చేలా ఉన్నాడు చరణ్. త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు చెర్రీ. ఈ సినిమాలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ నే రిపీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. నిజానికి ఈ సారి రకుల్ పేరు ప్రస్తావించింది చెర్రీ కాదు. నాన్నకు ప్రేమతో సినిమాతో హిట్ కొట్టిన సుకుమార్… అందులో హీరోయిన్ గా నటించిన రకుల్ నే మరోసారి రిపీట్ చేద్దామని అనుకుంటున్నాడట. అలా చెర్రీ సరసన వరుసగా మూడోసారి నటించే అవకాశానికి మెట్టు దూరంలో ఉంది రకుల్ ప్రీత్ సింగ్.