Telugu Global
Cinema & Entertainment

ఆ సినిమాకు క్లయిమాక్సే ప్రాణమట....

సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత లేనిదే నాని ఒప్పుకోడేన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు నాని ఇదే పద్ధతిలో వెళ్లాడు. కృష్ణగాడి వీరప్రేమగాథ, భలే భలే మగాడివోయ్… ఇలా ఏ సినిమా తీసుకున్నా అందులో నాని క్యారెక్టరైజేషన్ మాత్రమే కాదు… టోటల్ సినిమా కూడా విభిన్నంగా ఉంటుంది. తాజాగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో జెంటిల్ మన్ సినిమా చేస్తున్నాడు నాని. కాబట్టి.. ఈ సినిమాలో కూడా కచ్చితంగా ఏదో ఒక స్పెషాలిటీ ఉండే ఉంటుందని అంతా […]

ఆ సినిమాకు క్లయిమాక్సే ప్రాణమట....
X
సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత లేనిదే నాని ఒప్పుకోడేన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు నాని ఇదే పద్ధతిలో వెళ్లాడు. కృష్ణగాడి వీరప్రేమగాథ, భలే భలే మగాడివోయ్… ఇలా ఏ సినిమా తీసుకున్నా అందులో నాని క్యారెక్టరైజేషన్ మాత్రమే కాదు… టోటల్ సినిమా కూడా విభిన్నంగా ఉంటుంది. తాజాగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో జెంటిల్ మన్ సినిమా చేస్తున్నాడు నాని. కాబట్టి.. ఈ సినిమాలో కూడా కచ్చితంగా ఏదో ఒక స్పెషాలిటీ ఉండే ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టే ట్రయిలర్, పోస్టర్లు విడుదలయ్యాయి. ఒక యాంగిల్ లో సాఫ్ట్ గా… మరో యాంగిల్ లో విలన్ ఛాయల్లో నాని కనిపిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం… జెంటిల్ మన్ సినిమాకు క్లయిమాక్సే ప్రాణమని భావిస్తున్నారు. సినిమా సస్పెన్స్ మొత్తాన్ని రివీల్ చేసే క్లయిమాక్స్ దాదాపు 20 నిమిషాల పాటు ఉంటుందని… కేవలం ఈ క్లయిమాక్స్ నచ్చే నాని సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. కేవలం ఈ కథ నచ్చడం వల్లనే… వరుసగా రెండు హిట్ సినిమాలు ఉన్నప్పటికీ… పారితోషికం ఏమాత్రం పెంచకుండా జెంటిల్ మన్ సినిమాలో నటించడానికి నాని ఒప్పుకున్నాడట. మరి నాని నమ్మకం మరోసారి నిజమవుతుందా…. లెట్స్ వెయిట్ అండ్ సీ…
First Published:  7 Jun 2016 11:09 PM GMT
Next Story