Telugu Global
Cinema & Entertainment

ఒకేసారి 5 రాష్ట్రాల్లో బాలయ్య బర్త్ డే

ఇక్కడే కాదు.,, విదేశాల్లో కూడా ఒకేసారి 5 రాష్ట్రాల్లో బాలయ్య పుట్టినరోజును సెలబ్రేట్ చేయాలని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. మరికొన్ని రోజుల్లో బాలయ్య తన 56వ వడిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సందర్భంగా దేశంలోని 5 రాష్ట్రాల్లో 56 ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఫ్యాన్స్ సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలను ఎంపికచేశారు. పుట్టినరోజు నాడు ఈ 5 రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే […]

ఒకేసారి 5 రాష్ట్రాల్లో బాలయ్య బర్త్ డే
X
ఇక్కడే కాదు.,, విదేశాల్లో కూడా ఒకేసారి 5 రాష్ట్రాల్లో బాలయ్య పుట్టినరోజును సెలబ్రేట్ చేయాలని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. మరికొన్ని రోజుల్లో బాలయ్య తన 56వ వడిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సందర్భంగా దేశంలోని 5 రాష్ట్రాల్లో 56 ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఫ్యాన్స్ సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలను ఎంపికచేశారు. పుట్టినరోజు నాడు ఈ 5 రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే బాలయ్య మాత్రం ఈసారి తన పుట్టినరోజును విదేశాల్లో సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించారు. అమెరికాలోని న్యూజెర్సీలో బాలయ్య పుట్టినరోజు వేడుకలు ఉంటాయి. ఈ సందర్భంగా అమెరికాలోని 5 రాష్ట్రాల్లో కూడా బాలయ్య పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయాల్లో బిజీగా ఉన్న బాలయ్య… సేమ్ టైం తన వందో సినిమాతో కూడా వార్తల్లో వ్యక్తిగా మారాడు. జీవితంలో అత్యంత కీలకమైన, ఉన్నతమైన దశలో ఉన్న బాలయ్య పుట్టినరోజును నభూతో అనే విధంగా సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నారు.
First Published:  7 Jun 2016 11:03 PM GMT
Next Story