Telugu Global
Cinema & Entertainment

మరోసారి వాయిదాపడిన వెంకీ సినిమా

ఇప్పటికే వెంకీ సినిమా ఒకసారి వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి వాయిదా పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో బాబు బంగారం అనే సినిమా చేస్తున్నాడు వెంకటేశ్. ఈ సినిమా టీజర్ ఈమధ్యే విడుదలైంది. మంచి రెస్పాన్స్ కూడా తెచ్చుకుంది. మరోవైపు సినిమా పోస్టర్లకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. వెంకీ-నయన్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. నయనతార కాల్షీట్లు ఎడ్జస్ట్ చేయలేకపోవడంతో సినిమా విడుదలను వాయిదా […]

మరోసారి వాయిదాపడిన వెంకీ సినిమా
X
ఇప్పటికే వెంకీ సినిమా ఒకసారి వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి వాయిదా పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో బాబు బంగారం అనే సినిమా చేస్తున్నాడు వెంకటేశ్. ఈ సినిమా టీజర్ ఈమధ్యే విడుదలైంది. మంచి రెస్పాన్స్ కూడా తెచ్చుకుంది. మరోవైపు సినిమా పోస్టర్లకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. వెంకీ-నయన్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. నయనతార కాల్షీట్లు ఎడ్జస్ట్ చేయలేకపోవడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. మరోవైపు బ్రహ్మోత్సవం సినిమా విడుదల కారణంగా కూడా బాబు బంగారం వాయిదా పడింది. ఎట్టకేలకు జులై 1న సినిమాను విడుదల చేస్తామని ఆమధ్య ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఆ తేదీకి కూడా సినిమా విడుదలయ్యేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఆ తేదీకి రజనీకాంత్ నటిస్తున్న కబాలి సినిమా విడుదలకానుంది. అందుకే జులై 1 నుంచి బాబు బంగారాన్ని తప్పించాలని మేకర్స్ భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం… జులై 29న బాబు బంగారం సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన రానుంది.
First Published:  7 Jun 2016 11:05 PM GMT
Next Story