Telugu Global
Cinema & Entertainment

విలన్ కోసం మహేష్ బాబు వెయిటింగ్ 

 మహేష్ బాబు-మురుగదాస్  సినిమాకు డేట్ ఫిక్స్ చేశారు. హీరోయిన్ ను కూడా ఫైనలైజ్ చేశారు. కానీ విలన్ మాత్రం ఇంకా పక్కా అవ్వలేదు. విలన్ ఎవరనేది తేలిపోతే సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టించడమే ఆలస్యం. వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాను జులై 15 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. హీరోయిన్ గా పరిణీతి చోప్రాను ఫిక్స్ చేశారు. కీర్తి సురేష్, సాయి పల్లవిని పక్కనపెట్టి పరిణీతిని ఎంచుకున్నారు. ఇక విలన్  దొరకడమే ఆలస్యం. […]

విలన్ కోసం మహేష్ బాబు వెయిటింగ్ 
X
మహేష్ బాబు-మురుగదాస్ సినిమాకు డేట్ ఫిక్స్ చేశారు. హీరోయిన్ ను కూడా ఫైనలైజ్ చేశారు. కానీ విలన్ మాత్రం ఇంకా పక్కా అవ్వలేదు. విలన్ ఎవరనేది తేలిపోతే సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టించడమే ఆలస్యం. వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాను జులై 15 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. హీరోయిన్ గా పరిణీతి చోప్రాను ఫిక్స్ చేశారు. కీర్తి సురేష్, సాయి పల్లవిని పక్కనపెట్టి పరిణీతిని ఎంచుకున్నారు. ఇక విలన్ దొరకడమే ఆలస్యం. మొదట్లో ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ను విలన్ గా తీసుకోవాలని అనుకున్నారు. ప్రస్తుతం రోబో 2.0 లో విలన్ గా నటిస్తున్న అక్షయ్ కుమార్…. మహేష్ బాబు సినిమాలో మాత్రం ప్రతినాయకుడిగా కనిపించేందుకు ఒప్పుకోలేదు. దీంతో మరో నటుడి కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. కుదిరితే బాలీవుడ్ కు చెందిన నటుడ్నే మహేష్ సినిమాలో విలన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. తాజా చిత్రంతోమహేష్ బాబు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అందుకే పరిణీతి చోప్రాను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతుంది.
First Published:  7 Jun 2016 11:01 PM GMT
Next Story