Telugu Global
Cinema & Entertainment

సీక్వెల్ నుంచి పక్కకు తప్పుకున్న నితిన్

ఇష్క్ తర్వాత నితిన్ ను మరోసారి హీరోగా నిలబెట్టిన సినిమా గుండెజారి గల్లంతయ్యిందే. ఇష్క్ కంటే పెద్ద విజయం సాధించి ఈ సినిమా. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానని నితిన్ గతంలోనే ప్రకటించాడు. అటు విజయ్ కుమార్ కు కూడా సరైన సక్సెస్ లేకపోవడంతో మరోసారి గుండెజారి గల్లంతయిందే ప్రాజెక్టుపని మీద పడ్డాడు. అప్పటి హిట్ సినిమాకు సీక్వెల్ రాసుకున్నాడు. అయితే తాజాగా ఈ సీక్వెల్ నుంచి నితిన్ తప్పుకున్నట్టు […]

సీక్వెల్ నుంచి పక్కకు తప్పుకున్న నితిన్
X
ఇష్క్ తర్వాత నితిన్ ను మరోసారి హీరోగా నిలబెట్టిన సినిమా గుండెజారి గల్లంతయ్యిందే. ఇష్క్ కంటే పెద్ద విజయం సాధించి ఈ సినిమా. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానని నితిన్ గతంలోనే ప్రకటించాడు. అటు విజయ్ కుమార్ కు కూడా సరైన సక్సెస్ లేకపోవడంతో మరోసారి గుండెజారి గల్లంతయిందే ప్రాజెక్టుపని మీద పడ్డాడు. అప్పటి హిట్ సినిమాకు సీక్వెల్ రాసుకున్నాడు. అయితే తాజాగా ఈ సీక్వెల్ నుంచి నితిన్ తప్పుకున్నట్టు తెలుస్తోంది.
అ..ఆ సినిమాతో తన మార్కెట్ పరిథిని పెంచుకున్న నితిన్… సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. అందుకే ఇప్పటికే ఒప్పుకున్న కరుణాకరన్ సినిమాను కూడా పెండింగ్ లో పెట్టాడట. మరోవైపు విజయ్ కుమార్ కొండా రాసిన సీక్వెల్ కథను కూడా నితిన్ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సీక్వెల్ లో సెకండాఫ్ తనకు నచ్చలేదని నితిన్ చెప్పాడట. ఈ రెండు ప్రాజెక్టులు పక్కనపెట్టిన నితిన్… నేను శైలజ సినిమా దర్శకుడు కిషోర్ తిరుమలతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడట. తన సొంత బ్యానర్ పైనే ఈ సినిమాను నిర్మించేందుకు నితిన్ రెడీ అవుతున్నట్టు సమాచారం.
First Published:  8 Jun 2016 11:00 PM GMT
Next Story