Telugu Global
Cinema & Entertainment

త్వరలోనే జైలు ఊచలు లెక్కబెట్టనున్న చిరంజీవి

అవును… మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే జైలు ఊచలు లెక్కబెట్టనున్నారు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి ఇంకొన్ని రోజులు మాత్రమే టైం ఉంది. ఎంతోమంది ప్రతిఘటిస్తున్నప్పటికీ…. మరికొంతమంది కళ్లుగప్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ చిరంజీవిని అరెస్ట్ చేయడం మాత్రం ఖాయం. అయితే ఇదంతా నిజజీవితంలో కాదు… చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన మేటర్. అవును… జైలు సన్నివేశాలతో చిరంజీవి 150వ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈనెల 20 నుంచి ఈ సినిమా షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి రామోజీ […]

త్వరలోనే జైలు ఊచలు లెక్కబెట్టనున్న చిరంజీవి
X
అవును… మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే జైలు ఊచలు లెక్కబెట్టనున్నారు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి ఇంకొన్ని రోజులు మాత్రమే టైం ఉంది. ఎంతోమంది ప్రతిఘటిస్తున్నప్పటికీ…. మరికొంతమంది కళ్లుగప్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ చిరంజీవిని అరెస్ట్ చేయడం మాత్రం ఖాయం. అయితే ఇదంతా నిజజీవితంలో కాదు… చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన మేటర్. అవును… జైలు సన్నివేశాలతో చిరంజీవి 150వ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈనెల 20 నుంచి ఈ సినిమా షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి రామోజీ ఫిలింసిటీలో జైలు సెట్ ను నిర్మిస్తున్నారు.
తోట తరణి పర్యవేక్షణలో భారీ స్థాయిలో ఈ సెట్ రూపుదిద్దుకుంటోంది. ఈ సెట్ లోనే చిరంజీవి సినిమా ప్రారంభమౌతుంది. చిరంజీవిని అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లే సన్నివేశాలతో పాటు… జైలు నుంచి చిరంజీవి తప్పుకునే సన్నివేశాల్ని ఇక్కడ చిత్రీకరిస్తారు. మరోవైపు ఐటెంసాంగ్ కు సంబంధించిన సెట్ కూడా రెడీ అవుతోంది. అది ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది మాత్రం అప్పుడే చెప్పలేం అంటున్నారు మేకర్స్. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. తాజాగా దీపిక పదుకోన్ పేరు కూడా చక్కర్లు కొడుతోంది.

Click on Image to Read:

yanamala

jagan-chandra-babu

vasireddy-padma-vs-mla-anit

mla-ashok-reddy

mlc-satish-reddy

ap-capital

avinash-reddy

vasireddy-padma

pardasaradhi

vasireddy-padma

tv5-survy

First Published:  8 Jun 2016 11:07 PM GMT
Next Story