Telugu Global
Cinema & Entertainment

మ‌హేష్ బాబు.. ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ గురించి ర‌క‌ర‌క‌ల స్టోరీస్..

ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏమిటంటే మహేష్, మురగదాస్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ గురించే అంతటా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. సినిమా ఎలా ఉండబోతోందనే విషయం నుంచి, అసలు మహేష్ కు ఎంత రెమ్యునేషన్ ఎంత ఇవ్వబోతున్నారనే విషయం దాకా అనేక విషయాలు చర్చకు వస్తున్నాయి. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకోవటంతో, టెక్నికల్ హెడ్స్ మీటింగ్ ముంబైలో జరిగిందని సమాచారం. అందులో మురుగదాస్ తన టీమ్ అందరినీ ఒకరితో మరొకరుకు పరిచయం చేయటమే కాక, […]

మ‌హేష్ బాబు.. ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ గురించి ర‌క‌ర‌క‌ల స్టోరీస్..
X

ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏమిటంటే మహేష్, మురగదాస్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ గురించే అంతటా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. సినిమా ఎలా ఉండబోతోందనే విషయం నుంచి, అసలు మహేష్ కు ఎంత రెమ్యునేషన్ ఎంత ఇవ్వబోతున్నారనే విషయం దాకా అనేక విషయాలు చర్చకు వస్తున్నాయి. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకోవటంతో, టెక్నికల్ హెడ్స్ మీటింగ్ ముంబైలో జరిగిందని సమాచారం. అందులో మురుగదాస్ తన టీమ్ అందరినీ ఒకరితో మరొకరుకు పరిచయం చేయటమే కాక, సినిమాలో ఏ కలర్ స్కీమ్ వాడాలి, ఎలాంటి విజువల్స్ ఉంటాలి, కథకు తగ్గట్లుగా టెక్నికల్ టీమ్ ఎలా పనిచేయాలనే విషయం చర్చించినట్లు తెలుస్తోంది.

తమిళ, తెలుగు, హిందీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ రెడీ కాబోతున్న ఈ చిత్రం మహేష్ కెరీర్ లో ఓ మైలు రాయిలా మిగిలిపోతుందని చెప్తున్నారు. విజయ్ తో తుపాకి వంటి సూపర్ హిట్ ఇచ్చిన మురగదాస్ ఈ సారి ఈ సినిమా అంతకుమించిన టైట్ స్క్రిప్టు తో రాబోతున్నట్లు తమిళ సిని వర్గాల్లో వినపడుతోంది. బ్రహ్మోత్సవం డిజాస్టర్ తో మహేష్ బాబు మార్కెట్ తగ్గతుందని, ఆయన రెమ్యునేషన్ లో కోత ఉంటుందని, తదుపరి చిత్రానికి బడ్జెట్ కంట్రోలు ఉండబోతోందని రకరకాల రూమర్స్ మార్కెట్లో వినిపించాయి. అయితే అవన్నీ కేవలం రూమర్స్ గానే మిగిలిపోనున్నాయి. మహేష్, మురగదాస్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి మహేష్ గట్టిగానే తీసుకుంటున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం 85 కోట్ల బడ్జెట్ తో రెడీ అవుతోంది. మరి ఇందులో మహేష్ రెమ్యునేషన్ ఎంత అంటారా.. 23 కోట్లు అని తెలుస్తోంది.

First Published:  9 Jun 2016 10:16 PM GMT
Next Story