Telugu Global
NEWS

కాస్తుంటే కొట్లాటే!

మంత్రి జూప‌ల్లి, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిల మ‌ధ్య విబేధాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి.  కాస్త ఉంటే కొట్లాట జ‌రిగేదేమో అనిపించేలా కనిపించింది ప‌రిస్థితి. అభివృద్ధి కార్య‌క్ర‌మాల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి ఎప్ప‌ట్లాగే అధికార పార్టీపై గ‌య్యిమంటూ ఒంటికాలిపై లేవ‌డమే వివాదాల‌కు కార‌ణంగా తెలుస్తోంది. మ‌రో సంద‌ర్భంలో చంద్ర‌బాబుపై జూప‌ల్లి ఆరోప‌ణ‌లు చేయ‌డంతో మంత్రిని కొట్టినంత ప‌నిచేశాడు. ఆయ‌న చేతిలో మైకును లాక్కుని క‌య్యానికి కాలు దువ్వాడు. మొత్తం మీద ఈ వ్య‌వ‌హారంలో రేవంత్ రెడ్డి అతిగా ప్ర‌వ‌ర్తించాడ‌ని […]

కాస్తుంటే కొట్లాటే!
X
మంత్రి జూప‌ల్లి, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిల మ‌ధ్య విబేధాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. కాస్త ఉంటే కొట్లాట జ‌రిగేదేమో అనిపించేలా కనిపించింది ప‌రిస్థితి. అభివృద్ధి కార్య‌క్ర‌మాల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి ఎప్ప‌ట్లాగే అధికార పార్టీపై గ‌య్యిమంటూ ఒంటికాలిపై లేవ‌డమే వివాదాల‌కు కార‌ణంగా తెలుస్తోంది. మ‌రో సంద‌ర్భంలో చంద్ర‌బాబుపై జూప‌ల్లి ఆరోప‌ణ‌లు చేయ‌డంతో మంత్రిని కొట్టినంత ప‌నిచేశాడు. ఆయ‌న చేతిలో మైకును లాక్కుని క‌య్యానికి కాలు దువ్వాడు. మొత్తం మీద ఈ వ్య‌వ‌హారంలో రేవంత్ రెడ్డి అతిగా ప్ర‌వ‌ర్తించాడ‌ని గులాబీనేత‌లు మండిప‌డుతుండ‌గా… తెలంగాణ‌లో ఉంటూ చంద్ర‌బాబుకు చెంచాలా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని తెలంగాణవాదులు విమ‌ర్శిస్తున్నారు.
అస‌లేం జ‌రిగిందంటే..?
కోస్గి మండలం భోగారంలో గురువారం రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించ‌డానికి మంత్రి జూప‌ల్లి ముఖ్యఅతిథిగా వ‌చ్చారు. ఇదే కార్య‌క్ర‌మానికి రేవంత్ కూడా హాజ‌ర‌య్యాడు. శంకుస్థాప‌న వ‌స్ర్తం గులాబీ రంగులో ఎందుకు ఉంద‌ని రేవంత్ అభ్యంత‌రం తెలిపాడు. జూప‌ల్లి రంగుదేముందిలే? అన‌డంతో కాస్త త‌గ్గాడు. అనంత‌రం వీరంతా స‌భ‌లో పాల్గొన్నారు. జూప‌ల్లి ప్ర‌సంగిస్తూ..తెలంగాణ‌లో ప్రాజెక్టుల‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు అడ్డుప‌డుతున్నాడ‌ని ఆరోపించారు. అంతే.. కోపంతో ఒక్క ఉదుటున లేచిన రేవంత్ మంత్రివైపు దూసుకెళ్లాడు. మంత్రి చేతిలో మైక్‌ను రేవంత్ లాక్కుని, ప్ర‌సంగాన్ని అడ్డుకోవ‌డంతో గొడ‌వ మొద‌లైంది. నువ్వెంత‌.. అంటే నువ్వెంత‌..! అనుకున్నారు. వీరిద్ద‌రూ ఇలా ప‌బ్లిగ్గా బాహాబాహీకి దిగ‌డంతో అక్క‌డ కాసేపు గంద‌ర‌గోళం నెల‌కొంది. ప‌రస్ప‌రం నిందించుకున్నారు. గొడ‌వ పెద్ద‌ది కావ‌డంతో.. పోలీసులు లాఠీఛార్జి చేశారు. అనంత‌రం మంత్రి అక్క‌డ నుంచి నిష్ర్క‌మించారు.
గ‌తేడాది ఇదే దూకుడు..!
గ‌తేడాది ఆగ‌స్టులో కొడంగ‌ల్‌లోని వ్య‌వ‌సాయ మార్కెట్ ప్రారంభోత్స‌వంలోనూ రేవంత్ హ‌ల్‌చ‌ల్ చేశాడు. త‌న ఆహ్వానం రాలేద‌ని అనుచ‌రుల‌తో క‌లిసి మంత్రి జూప‌ల్లిని అడ్డుకున్నారు. దీంతో రెండు వ‌ర్గాల వారు కొట్లాట‌కు దిగారు. రేవంత్ అనుచ‌రులు అక్క‌డున్న ఓ వాహ‌నాన్ని ధ్వంసం చేశారు. అప్పుడు కూడా పోలీసులు క‌ల‌గ‌జేసుకోవాల్సి వ‌చ్చింది. రేవంత్ ని అరెస్టు చేయ‌డంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. రాజ‌కీయ అభ్యంత‌రాలు ఉంటే.. నిర‌స‌న తెలిపే అధికారం అంద‌రికీ ఉంది. కానీ, ఇలా మందిని వెంటేసుకుని మంత్రి కార్య‌క్రమాల‌ను అడ్డుకోవ‌డం ఏంటి? అని గులాబీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా పోలీసుల‌కు దొరికిన రేవంత్ మాకు నీతులు చెప్ప‌డ‌మేంట‌ని చోద్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయన రౌడీయిజం చేస్తే స‌హించేది లేద‌ని స్ప‌ష్టంచేస్తున్నారు.

Click on Image to Read:

ts-congress

buggana-rajendranath-reddy

tdp-mla-madhava-naidu

sakshi

babumohan

gangula-prabakar-reddy-rama

yanamala-ramakrishnudu-swis

yanamala

chandrababu-naidu

jagan-chandra-babu

vasireddy-padma-vs-mla-anit

mla-ashok-reddy

mlc-satish-reddy

ap-capital

avinash-reddy

First Published:  9 Jun 2016 11:07 PM GMT
Next Story