ముద్రగడ పేరుకోసం పాకులాడుతున్నారు… అందుకే రిజర్వేషన్లు ఆలస్యం

కాపులకోసం దీక్ష చేస్తున్న ముద్రగడపై మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. ముద్రగడ కాపులను కలుపుకుపోవడం లేదని మండిపడ్డారు. తనకు మాత్రమే పేరు రావాలన్నట్టుగా ముద్రగడ తీరుందని విమర్శించారు. ముద్రగడ పేరుకోసం పాకులాడడం వల్లే ఇప్పటి వరకు రిజర్వేషన్లు కల్పించలేదని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు ఇప్పటికీ రాకపోవడానికి కారణం ముద్రగడేనని ఆరోపించారు.

ముద్రగడవన్నీ ఏకపక్షనిర్ణయాలని నారాయణ మండిపడ్డారు. ఏ సీఎం చేయని విధంగా కాపుల కోసం చంద్రబాబు పని చేస్తున్నారని చెప్పారు. ముందస్తు జాగ్రత్త కోసమే ముదగ్రడను అరెస్ట్ చేశామన్నారు. పురుగల మందుతాగుతానని ముద్రగడ అంటుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. సీబీఐ కేసుల్లో ఇరుకున్న జగన్… ప్రతిదానికి సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. తుని ఘటనలో పాల్గొన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని ముద్రగడ డిమాండ్ చేయడం సరికాదన్నారు.

Click on Image to Read:

ys-jagan

ts-congress

buggana-rajendranath-reddy

tdp-mla-madhava-naidu

sakshi

babumohan

gangula-prabakar-reddy-rama

yanamala-ramakrishnudu-swis

yanamala

chandrababu-naidu

jagan-chandra-babu

vasireddy-padma-vs-mla-anit

mla-ashok-reddy

mlc-satish-reddy

avinash-reddy