వారసుల హంగామానే ఇప్పుడు హాట్ టాపిక్

హీరోగారు ఏం చేస్తున్నారనేది ఇప్పుడు అప్రస్తుతం. సదరు హీరోగారి మనవడు లేదా కొడుకు ఏం చేస్తున్నాడు… ఆ పెద్ద నటుడి మనవరాలు ఏం చేస్తోందనేది ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారింది. ఈ ఆసక్తికి తగ్గట్టే వారసులు కూడా రోజుకో వార్తతో హల్ చల్ చేస్తున్నారు.
షారుఖ్ తనయుడు అబ్రామ్ లీలలు మీడియాను అప్పట్లో బాగానే ఆకట్టుకున్నాయి. ఇక శ్రీదేవి పెద్ద కూతురైతే ఎప్పుడూ మీడియాలో హెడ్ లైనే. ఆమధ్య సైఫ్ అలీఖాన్ కూతురు కూడా ఓ రేంజ్ లో హంగామా చేసింది. ఈ మధ్య కాస్త సైలెంట్ అయినట్టు కనిపిస్తున్నా.. అమ్మడు ఎప్పుడో అప్పుడు సడెన్ గా ఓ హాట్ ఫోటో షూట్ చేసి పడేసి తెరంగేట్రం చేసేలానే ఉంది. ఇప్పుడీ లిస్ట్ లోకి బిగ్ బి అమితాబ్ మనవరాలు కూడా చేరిపోయింది. ఈమె ఏకంగా నెటిజన్లకు బికినీ షో ఇచ్చింది. ముంబయిలోని సముద్రంలో బోట్ లో షికారు చేస్తున్న నవ్యా నవేలీ… ఏకంగా బికినీతో సందడి చేసింది. స్టెప్పులు దంచేసింది. అక్కడితో ఆగకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. ఇది తనే పోస్ట్ చేసిందా… లేక వాళ్ల గ్రూప్ లో సభ్యులెవరైనా పెట్టారా అనేది తేలాల్సి ఉంది. కానీ వీడియో మాత్రం వైరల్ అయిపోయింది. దీంతో బిగ్ బి వెంటనే రంగంలోకి దిగారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా లీకైన ఆ వీడియోను నెట్ నుంచి తొలిగించారు. అయితే అప్పటికే కథ ముగిసింది. సదరు వీడియోను చాలామంది షేర్ చేశారు. లక్షల్లో చూసేశారు. ఈ వీడియోపై బిగ్ బి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. నిత్యం ట్వీట్స్ చేసే అమితాబ్ ఈ వీడియో వచ్చిన తర్వాత ట్వీట్స్ బాగా తగ్గించేశారు. 
Click on Image Read:
trivikram-pawan
allu-arjun
srinu-vaitla-varun-tej