వైట్ల – వరుణ్ తేజ సినిమా ఆగిపోలేదు.. 

అంతా ఫైనలైజ్ అయి సినిమా సెట్స్ పైకి వస్తుందనుకున్న టైమ్ లో… వరుణ్  తేజ, శ్రీనువైట్ల ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడనే వార్తలు వచ్చాయి. దీంతో చాలామంది వైట్లను చూసి జాలిపడ్డారు. అయితే అలా ఆగిపోయిందనుకున్న సినిమా ఇప్పుడు మళ్లీ పట్టాలపైకి రానుంది. ఈనెల 27 నుంచి శ్రీనువైట్ల సినిమా ఉంటుందని స్వయంగా హీరో వరుణ్ తేజ ఎనౌన్స్ చేశాడు. స్పెయిన్ లో ఏకథాటిగా రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతుందని కూడా ప్రకటించాడు. ఈ ప్రాజెక్టుకు మిస్టర్ అనే పేరును ఇప్పటికే ఖరారుచేశారు. ముహూర్తం షాట్ కూడా అయిపోయింది. అంతా అయిన తర్వాత ఆగిపోయిందనుకున్న ఈ సినిమా… తిరిగి పట్టాలపైకి రావడంతో అటు వైట్లతో పాటు మెగా కాంపౌండ్ కూడా హ్యాపీ ఫీలైంది. ఏకథాటిగా ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయాలని నిర్ణయించారు. నిజానికి వైట్ల-వరుణ్ తేజ సినిమా ఆగిపోయిందనే వార్తలు రావడానికి కారణం శేఖర్ కమ్ముల. వరుణ్ తేజ కోసం ఓ మాంచి లవ్ స్టోరీ రాశాడు కమ్ముల. స్టోరీ నచ్చిన వరుణ్ తేజ, వైట్ల సినిమా కంటే ముందే కమ్ముల సినిమాను పట్టాలపైకి తీసుకురావాలనుకున్నాడు. అందుకే వైట్ల సినిమా సెట్స్ పైకివెళ్లడం ఆలస్యమైంది. అయితే తాజాగా మరింత టైమ్ కావాలని కమ్ముల కోరడంతో… ఈ గ్యాప్ లో మిస్టర్ సినిమాను ముగించాలని వరుణ్ తేజ డిసైడ్ అయ్యాడు. 
Click on Image Read:
trivikram-pawan
allu-arjun
bollywood