Telugu Global
NEWS

మాకే ఇలాగైతే సామాన్యుల సంగతేంటి? టీడీపీ ఎమ్మెల్యే అయితే చర్యలు తీసుకోరా?... మీడియా ముందు న్యాయమూర్తి ఆవేదన...

మహిళలు, పేదలు, పోలీసులే కాదు టీడీపీ నేతల బాధితుల జాబితాలో న్యాయవర్గాలు కూడా చేరాయి.. న్యాయమూర్తితోనే గొడవపడ్డ టీడీపీ ఎమ్మెల్యే మాధవనాయుడుపై 22 నెలలు గడుస్తున్నా చర్యలు తీసుకోకపోవడంపై న్యాయవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై పశ్చిమగోదావరి జిల్లా అదనపు న్యాయమూర్తి పి. కల్యాణ్‌ రావు ప్రెస్‌మీట్‌ పెట్టి ఆవేదనచెందారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే చర్యలుండవా అని ప్రశ్నించారు. తమకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆందోళన చెందారు. చివరకు […]

మాకే ఇలాగైతే సామాన్యుల సంగతేంటి? టీడీపీ ఎమ్మెల్యే అయితే చర్యలు తీసుకోరా?... మీడియా ముందు న్యాయమూర్తి ఆవేదన...
X

మహిళలు, పేదలు, పోలీసులే కాదు టీడీపీ నేతల బాధితుల జాబితాలో న్యాయవర్గాలు కూడా చేరాయి.. న్యాయమూర్తితోనే గొడవపడ్డ టీడీపీ ఎమ్మెల్యే మాధవనాయుడుపై 22 నెలలు గడుస్తున్నా చర్యలు తీసుకోకపోవడంపై న్యాయవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై పశ్చిమగోదావరి జిల్లా అదనపు న్యాయమూర్తి పి. కల్యాణ్‌ రావు ప్రెస్‌మీట్‌ పెట్టి ఆవేదనచెందారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే చర్యలుండవా అని ప్రశ్నించారు. తమకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆందోళన చెందారు. చివరకు న్యాయమూర్తి కూడా మానవహక్కుల కమిషన్‌కు లేఖ రాయాల్సి వచ్చింది.

వివాదం ఇదీ…

22 నెలలక్రితం నరసాపురం కోర్టు కాంపౌడ్ వాల్ వద్ద ఆక్రమణలను కోర్టు సిబ్బంది తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నరసాపురం ఎమ్మెల్యే మాధవనాయుడు తన అనుచరులతో కలిసి వచ్చి ఆగస్ట్ 15న స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్న సమయంలోనే కోర్టు ఆవరణలో నానారభస చేశారు. న్యాయవాదులతో గొడవపడ్డారు. అక్కడికి వచ్చిన న్యాయమూర్తి కల్యాణరావుతోనూ ఎమ్మెల్యే మాధవనాయుడు దురుసుగా ప్రవర్తించి గొడవపడ్డారు. దీనిపై అప్పట్లో కోర్టు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు చర్యలు లేవు.

ఎమ్మెల్యే అధికారపార్టీ వ్యక్తి కావడంతో పోలీసులు కేసును గాల్లో కలిపేశారు. 22 నెలలు అవుతున్నా ఘటనపై చార్జిషీట్ కూడా దాఖలు చేయలేదు. పలుమార్లు ఈ విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి న్యాయమూర్తి కల్యాణరావు తీసుకెళ్లారు. కానీ పోలీసులకు చీమ కుట్టినట్టుగానూ లేదు. దీంతో ఓపిక నశించిన న్యాయమూర్తి … ఈ విషయంపై సుప్రీంకోర్టు, రాష్ట్ర డీజీపీ, సీఎం, మానవ హక్కుల కమిషన్‌, చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కల్యాణరావు…రాష్ట్రంలో న్యాయమూర్తుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందని ఆవేదన చెందారు. రాజ్యాంగం ప్రకారం వ్యక్తులంతా సమానమేనని గుర్తు చేశారు. పోలీసుల తీరుతో న్యాయం జరగడం లేదని అందుకే ఈ విషయంపై ఆవేదనతో లేఖలు రాసినట్టు కల్యాణరావు చెప్పారు. ఒక న్యాయమూర్తి న్యాయం కోసం ఇలా సుప్రీంకోర్టుకు, మానవహక్కుల కమిషన్‌కు లేఖ రాయడం చాలా అరుదైన విషయమే.

Click on Image to Read:

buggana-rajendranath-reddy

sakshi

babumohan

gangula-prabakar-reddy-rama

yanamala-ramakrishnudu-swis

yanamala

chandrababu-naidu

jagan-chandra-babu

vasireddy-padma-vs-mla-anit

mla-ashok-reddy

mlc-satish-reddy

ap-capital

avinash-reddy

First Published:  9 Jun 2016 10:43 PM GMT
Next Story