త్రివిక్రమ్ కు షాకిచ్చిన పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో త్వరలోనే హ్యాట్రిక్ మూవీ రాబోతుందనే విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి పవన్-త్రివిక్రమ్ మధ్య ప్రస్తుతం కథాచర్చలు కూడా సాగుతున్నాయి. ఇప్పటికే పవన్ కు రెండు స్టోరీలైన్లు కూడా వినిపించాడట త్రివిక్రమ్. అయితే ఇదే సమయంలో త్రివిక్రమ్ కు అదిరిపోయే షాక్ ఇచ్చాడట పవర్ స్టార్.
త్రివిక్రమ్ చెప్పిన రెండు కథల్ని ఇష్టపడిన పవన్… వాటిలో ఒక కథతో రామ్ చరణ్ హీరోగా సినిమా చేయమని పురమాయించాడట. దీంతో త్రివిక్రమ్ షాక్. నిజానికి చెర్రీ హీరోగా, తను నిర్మాతగా ఓ సినిమా చేయాలనే కమిట్ మెంట్ ఎప్పట్నుంచో ఉంది. త్వరలోనే తను సినిమాల నుంచి తప్పుకుంటున్నాడు కాబట్టి… ఆ కమిట్ మెంట్ ను కూడా పూర్తిచేయాలని పవన్ అనుకుంటున్నాడు.
అందుకే త్రివిక్రమ్ చెప్పిన కథలో చెర్రీని హీరోని చేశాడు. అటు చరణ్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు ఎప్పట్నుంచో వెయిటింగ్. సో… చెర్రీతో సినిమా కంప్లీట్ అయిన తర్వాతే పవన్-త్రివిక్రమ్ సినిమా పట్టాలపైకి వస్తుందన్నమాట. త్రివిక్రమ్ పవన్ తో సినిమా చేస్తాడా… లేక చెర్రీతో కలిసి సెట్స్ పైకి వెళ్తాడా అనేది త్వరలోనే తెలిపోతుంది. 
Click on Image Read:
allu-arjun
bollywood
srinu-vaitla-varun-tej