కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్‌!

మూలిగే న‌క్క మీద తాటిపండు ప‌డ‌టం అంటే ఇదే! అస‌లే రోజురోజుకు అధికార పార్టీలోకి వెళుతున్న వారిని ఎలా నిలువ‌రించాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్న కాంగ్రెస్ పార్టీకి మ‌రో భారీ ఆప‌ద పొంచి ఉంది. న‌ల్ల‌గొండ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మిర్యాల‌గూడ ఎమ్మెల్యే భాస్క‌ర్‌రావులతోపాటు మ‌రికొంద‌రు సీనియ‌ర్ నేతలు పార్టీ మారుతుండ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. మాజీఎంపీ వివేక్ (పెద్ద‌ప‌ల్లి, క‌రీంన‌గ‌ర్‌) , మాజీ మంత్రి వినోద్ (చెన్నూరు, ఆదిలాబాద్‌), మాజీ స్పీక‌ర్ సురేశ్ రెడ్డి (నిజామాబాద్‌) త్వ‌ర‌లోనే గులాబీ కండువాలు కప్పుకోనున్నారు. వీరంతా గురువారం రాత్రి సీఎం కేసీఆర్‌ను ఆయ‌న ఫాంహౌస్‌లో క‌లిశారు. దీంతో వీరి చేరిక లాంఛ‌న‌మేన‌న్న వార్త‌లు గుప్పుమ‌న్నాయి. న‌ల్ల‌గొండ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వెన‌క్కి త‌గ్గిన‌పుడు కాంగ్రెస్ పార్టీ కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ, ఈ ముగ్గురు సీనియ‌ర్ నేత‌లు నిజంగానే పార్టీ మారితే కోలుకోలేని దెబ్బ త‌గిలిన‌ట్లే! ఈనెల 11న ఎంపీ గుత్తా కారెక్కుతాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరు కూడా అప్పుడే చేర‌తారా? స‌ప‌రేటుగా చేర‌తారా? అన్న‌ది తేలాల్సి ఉంది.
అంగ‌బ‌లం, ఆర్థిక బ‌లం మెండుగా ఉన్న‌వారే!
తాజాగా పార్టీ మారబోయే వారిలో మాజీఎంపీ వివేక్‌, మాజీ మంత్రి వినోద్‌లు ఇద్ద‌రూ సోద‌రులు. వీరిద్ద‌రూ మాజీ కేంద్ర‌మంత్రి వెంక‌ట‌స్వామి కుమారులు. వీరికి తెలంగాణ‌లో ముఖ్యంగా పెద్ద‌ప‌ల్లి, చెన్నూరు అంటే.. కరీంన‌గ‌ర్‌, ఆదిలాబాద్‌లోని సింగ‌రేణి ప‌రివాహ‌క ప్రాంతంలో మంచి ప‌ట్టు ఉంది. అందుకే, త‌మ తండ్రి పార్ల‌మెంటు స్థానంలోనే 2009లో వివేక్ గెల‌వ‌గా.. అదే పార్ల‌మెంటు ప‌రిధిలోనే ఉన్న చెన్నూరు నుంచి 2004లో గెలిచిన వినోద్ వైఎస్ హ‌యాంలో కార్మిక మంత్రిగా ప‌నిచేశారు. వీరి కుటుంబం తెలంగాణ‌లోని ధ‌నిక సంప‌న్న‌వ‌ర్గాల్లో ఒక‌టి. ఇక‌పోతే.. మాజీ స్పీక‌ర్ సురేష్ రెడ్డి ఈయ‌న మంచి విద్యావేత్త‌. అంగ‌బ‌లం, ఆర్థిక‌బ‌లం దన్ను ఎలాగో ఉంది. నిజంగా వీరు గ‌న‌క పార్టీ మారితే.. కాంగ్రెస్‌కు క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల ప‌రంగా తీవ్ర‌మైన కొర‌త ఏర్ప‌డుతుంది. ఫ‌లితంగా పోటీ చేసే అభ్య‌ర్థులు దొరికినా..కార్య‌క‌ర్త‌లు లేకుంటే ఆ పార్టీ ప్ర‌చారం జ‌నాల్లోకి చేర‌దు క‌దా! ఇవే గ‌న‌క నిజ‌మైతే కాంగ్రెస్ పార్టీకి ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో భారీ న‌ష్టం త‌ప్పేలా లేదు.

Click on Image to Read:

tdp-mla-madhava-naidu

buggana-rajendranath-reddy

sakshi

babumohan

gangula-prabakar-reddy-rama

yanamala-ramakrishnudu-swis

yanamala

chandrababu-naidu

jagan-chandra-babu

vasireddy-padma-vs-mla-anit

mla-ashok-reddy

mlc-satish-reddy

ap-capital

avinash-reddy