ఎన్టీఆర్ కు టార్గెట్ సెట్ చేసిన సినిమా

తారక్ కెరీర్ లో ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ సినిమా నాన్నకు ప్రేమతో. ఈ సినిమా సాధించినన్ని వసూళ్లు మరే సినిమా రాబట్టలేకపోయింది. ఈ సినిమాతోనే ఓవర్సీస్ లో బెస్ట్ అనిపించుకున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాతోనే తొలిసారిగా 40కోట్ల మార్క్ కు కూడా చేరుకోగలిగాడు. ఈ సినిమాతోనే ఫ్యామిలీ ఆడియన్స్, మల్టీప్లెక్స్ జనాలకు పూర్తిగా దగ్గర కాగలిగాడు. కానీ తారక్ స్టామినాకు ఇదే కొలమామం కాదని అంటున్నారు చాలామంది. ఇంతకుమించి టార్గెట్ ను క్రాస్ చేయగల సామర్థ్యం ఎన్టీఆర్ కు ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. అలాంటి టార్గెట్ ను సెట్ చేసే సినిమా కచ్చితంగా జనతా గ్యారేజీ అవుతుందని అంతా అభిప్రాయపడుతున్నారు. 
తారక్ కెరియర్ కు అసలైన పరీక్ష జనతా గ్యారేజీ సినిమానే అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ సినిమాతో తను క్రియేట్ చేసిన నాన్నకు ప్రేమతో రికార్డుల్ని కనుక తారక్ అధిగమిస్తే… కచ్చితంగా అతడి మార్కెట్ విస్తరించడానికి ఇంకా స్కోప్ ఉందనే విషయం అందరికీ తెలుస్తుంది. జనతా గ్యారేజీ కనుక నాన్నకు ప్రేమతో కంటే దిగువగానే వసూళ్లు సాధిస్తే కనుక… అదే తారక్ కు బెంచ్ మార్కు గా మిగిలిపోతుంది. అంతేకాదు.. తారక్ స్టామినా, అతడి మార్కెట్ వాల్యూ నాన్నకు ప్రేమతో సినిమా దగ్గరే ఆగిపోతుంది. మరోవైపు మహేష్, పవన్ లాంటి హీరోలు ఎప్పుడో బెంచ్ మార్క్స్ సెట్ చేశారు. చివరికి నితిన్ లాంటి హీరో సైతం తన మార్కెట్ పెంచుకున్నాడు. అందుకే జనతా గ్యారేజీతో కచ్చితంగా నాన్నకు ప్రేమతో రికార్డుల్ని క్రాస్ చేయాల్సిన అవసరం ఎన్టీఆర్ కు ఏర్పడింది.