Telugu Global
NEWS

టీడీపీలో స‌త్తాలేద‌ని ఒప్పేసుకున్నారు!

తెలంగాణ‌లో నాయ‌కులంతా వ‌రుస‌పెట్టి, పోటీలు ప‌డుతూ అధికార పార్టీలోకి మారుతున్నా.. టీడీపీలో ఆశ‌లు ఇంకా మిగిలే ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో తాము ఒక‌ప్ప‌టిలా బ‌లంగా లేమ‌న్న సంగ‌తిని బ‌హిరంగంగా అంగీక‌రించింది. ఈ విష‌యం తెలంగాణ తెలుగుదేశం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డే స్వ‌యంగా ఒప్పుకోవ‌డం విశేషం. తెలంగాణ‌లో ఎంద‌రు నాయ‌కులు వెళ్లిపోయినా.. టీడీపీకి జ‌రిగే నష్టం ఏమీ లేద‌ని, మా పార్టీ స‌మాజానికి నాయ‌కుల‌ను అందించే యూనివ‌ర్సిటీ అని గొప్ప‌లు పోయిన వారే ఇలా తాము బ‌ల‌హీనంగా […]

టీడీపీలో స‌త్తాలేద‌ని ఒప్పేసుకున్నారు!
X
తెలంగాణ‌లో నాయ‌కులంతా వ‌రుస‌పెట్టి, పోటీలు ప‌డుతూ అధికార పార్టీలోకి మారుతున్నా.. టీడీపీలో ఆశ‌లు ఇంకా మిగిలే ఉన్నాయి. ఇదే స‌మ‌యంలో తాము ఒక‌ప్ప‌టిలా బ‌లంగా లేమ‌న్న సంగ‌తిని బ‌హిరంగంగా అంగీక‌రించింది. ఈ విష‌యం తెలంగాణ తెలుగుదేశం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డే స్వ‌యంగా ఒప్పుకోవ‌డం విశేషం. తెలంగాణ‌లో ఎంద‌రు నాయ‌కులు వెళ్లిపోయినా.. టీడీపీకి జ‌రిగే నష్టం ఏమీ లేద‌ని, మా పార్టీ స‌మాజానికి నాయ‌కుల‌ను అందించే యూనివ‌ర్సిటీ అని గొప్ప‌లు పోయిన వారే ఇలా తాము బ‌ల‌హీనంగా ఉన్నామంటూ మీడియాకు వెల్ల‌డించ‌డం ఆ పార్టీ ద‌య‌నీయ స్థితికి అద్దం ప‌డుతోంది. పార్టీ బ‌లోపేతంలో భాగంగానే యువ‌తపై దృష్టి కేంద్రీక‌రించారు. 2019లో యువ‌త‌కు 99 సీట్లు ఖాయంగా ఇస్తామంటూ ముందే ప్ర‌క‌టించారు. క‌నీసం ప‌నిచేసే యువ‌త అయినా పార్టీకి జ‌వ‌జీవాలు నింపుతార‌న్న‌ది ఆ పార్టీ వ్యూహంగా క‌నిపిస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో తాము అధికారంలోకి రాలేమ‌ని ముందుగానే చేతులెత్తేసింది. కానీ, అధికార పక్షాన్ని దెబ్బతీసేందుకు మ‌రోసారి మ‌హాకూట‌మి ఏర్పాటు అంశాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చింది.
మొత్తానికి అధికార ప‌క్షాన్ని ఎదుర్కొనే స‌త్తా త‌మ‌లో లేద‌ని తెలుగుదేశం తొలిసారిగా ప్ర‌క‌టించింది. అస‌లే ఫిరాయింపుల‌తో నానా ఇబ్బందులు ప‌డుతున్న తెలుగుదేశం పార్టీకి ఓటుకు నోటు కేసు రూపంలో తెలంగాణ‌లో భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. అంతంత మాత్రంగా ఉన్న ప్ర‌జాద‌ర‌ణ అట్ట‌డుగు స్థాయికి దిగ‌జారింది. దీనికితోడు ఎమ్మెల్యేలంతా కారెక్క‌డంతో ముగ్గురంటే ముగ్గురే మిగిలారు. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని అర్ధాంత‌రంగా కూల్చాల‌ని చూసిన తెలుగుదేశం పార్టీని కేసీఆర్ దారుణంగా దెబ్బతీశారు. దీంతో కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు సిద్ధాంతాల‌ను, విబేధాల‌ను ప‌క్క‌న‌బెట్టింది. బద్ద విరోధి అయిన కాంగ్రెస్‌తో చేతులు క‌లిపింది. ఇప్పుడు మిగిలిన పార్టీల‌తోనూ చేతులు క‌లిపేందుకు సిద్ధంగా ఉంది. విప‌క్షాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టి మ‌రోసారి మ‌హాకూట‌మి ఏర్పాట్లు చేస్తామంటూ ప్ర‌క‌టించింది. 2019లో అధికారంలోకి రామ‌ని ముందే ప్ర‌క‌టించారు కాబ‌ట్టి, 2024లో త‌ప్ప‌కుండా అధికారంలోకి వ‌స్తామ‌ని దీమా వ్య‌క్తం చేశారు. అంటే..మ‌రో ఎనిమిదేళ్ల పాటు తెలంగాణ‌లో పార్టీ ఉంటుందా? అస‌లు పార్టీలో రేవంత్ రెడ్డి ఉంటాడా? అంటే… ఏదీ మార‌ద‌ని.. అప్పుడు కూడా తాను పార్టీలోనే కొన‌సాగుతాన‌ని చెప్ప‌డం కొస‌మెరుపు.

Click on Image to Read:

purandeswari

tdp-kapu-leaders

babu

sakshi-ganta-chinarajappa

kommineni-sakhi

buggana-rajendranath-reddy

ys-jagan

sakshi paper

tuni-train-incident

bramhini

minister-narayana

ts-congress

tdp-mla-madhava-naidu

First Published:  11 Jun 2016 12:00 AM GMT
Next Story