Telugu Global
Cinema & Entertainment

ఒక్క అమ్మాయి తప్ప అంటున్న సంజయ్ దత్

ఈ మధ్యనే జైలు నుండి విడుదల అయి, స్వేచ్ఛాగాలులు పీలుస్తూ మళ్ళీ సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్న.. బాలివుడ్ సూపర్‌స్టార్ సంజయ్ దత్ జీవితం పైన ఒక బయోపిక్ తీయడానికి బాలివుడ్ రెడీ అయిపోతుంది. మరి సంజయ్ దత్ జీవితం అంటే అన్ని రకాల ట్విస్టులు ఉన్నాయి. లవ్ అఫెయిర్లు, టెర్రరిస్ట్లులతో స్నేహాలు మరియు డ్రగ్ అడిక్షన్ .. ఎన్నో యాంగిల్స్ ఉన్నాయి. సినిమాకి సూపర్ సరుకు. కాని అందులో మాధురి దీక్షిత్ తో అఫెయిర్ కూడా […]

ఒక్క అమ్మాయి తప్ప అంటున్న సంజయ్ దత్
X

ఈ మధ్యనే జైలు నుండి విడుదల అయి, స్వేచ్ఛాగాలులు పీలుస్తూ మళ్ళీ సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్న.. బాలివుడ్ సూపర్‌స్టార్ సంజయ్ దత్ జీవితం పైన ఒక బయోపిక్ తీయడానికి బాలివుడ్ రెడీ అయిపోతుంది. మరి సంజయ్ దత్ జీవితం అంటే అన్ని రకాల ట్విస్టులు ఉన్నాయి. లవ్ అఫెయిర్లు, టెర్రరిస్ట్లులతో స్నేహాలు మరియు డ్రగ్ అడిక్షన్ .. ఎన్నో యాంగిల్స్ ఉన్నాయి. సినిమాకి సూపర్ సరుకు. కాని అందులో మాధురి దీక్షిత్ తో అఫెయిర్ కూడా ఉంటుంది. కాని ఇప్పుడేమో మాధురి చక్కగా పెళ్ళి చేసుకుని, ఇద్దరు పిల్లలతో కాపురం చేసుకుంటుంది. ఇప్పుడు ఆమెను సినిమాలకు ఈడ్చి రచ్చ చేయడం బాగోదు కనుక.. తన మాజిప్రేయసి అంకం తన బయోపిక్‌లో ఉండనవసరం లేదని సంజయ్ దత్ స్వయంగా నిర్ణయం తీసుకున్నాడట. మంచిదే. అయిపోయిన పెళ్ళికి ఇప్పుడు బాకాలు ఊదడం బాగుండదులే.

First Published:  11 Jun 2016 4:11 AM GMT
Next Story