చంద్రబాబుకు భలే బిరుదు ప్రదానం చేసిన టీడీపీ కాపులు

కాపులందు టీడీపీ కాపులు వేరయా… అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఒకవైపు ముద్రగడ అరెస్ట్‌, దీక్షతో కాపుల్లో అలజడి రేగుతుంటే టీడీపీలోని కాపు నేతలు మాత్రం చంద్రబాబును కాపుల పాలిట దేవుడు అని చిత్రీకరించేందుకు సర్వవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కాపులంతా చంద్రబాబు వైపేఉన్నారని చాటేందుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావ్ ఆధ్వర్యంలో మంగళగిరి మండలం ఆత్మకూరు హ్యాపీ రిసార్ట్స్‌లో టీడీపీ అనుకూల కాపు నేతలు సమావేశమయ్యారు. ఈసందర్భంగా టీడీపీ కాపు నేతలు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు.

కాపులకు చంద్రబాబు చేసినంతగా ఏ ముఖ్యమంత్రి చేయలేదని స్పీచ్‌లు దంచేశారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులే కాపులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. కాపులకోసం పోరాడుతున్న ముద్రగడపైనా టీడీపీ కాపులు ఫైర్ అయ్యారు. పదేపదే దీక్షల పేరుతో అలజడి సృష్టించడం సరికాదని మండిపడ్డారు. కాపు జాతి మొత్తం చంద్రబాబు పట్ల కృతజ్ఞతతో ఉండాలని సమావేశంలో కాపు సంఘం నేత నరహరి శెట్టి పిలుపునిచ్చారు. సమావేశంలో ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈసందర్బంగా చంద్రబాబుకు కాపు పేరుతో ఒక బిరుదును కూడా ఇచ్చేశారు. చంద్రబాబును ”కాపు మిత్ర” అని తీర్మానించారు. ఇకపై ”కాపు మిత్ర చంద్రబాబు” అన్న పదాన్ని బాగా ప్రచారం చేయాలని టీడీపీ కాపులు భావిస్తున్నారు. అయినా ”గోపాల మిత్ర”లాగా ”కాపు మిత్ర” బిరుదు భలే ఉంది.

Click on Image to Read:

babu

sakshi-ganta-chinarajappa

kommineni-sakhi

buggana-rajendranath-reddy

ys-jagan

sakshi paper

tuni-train-incident

bramhini

minister-narayana

ts-congress

tdp-mla-madhava-naidu