Telugu Global
NEWS

బొత్స, ఉమ్మారెడ్డి, అంబటి అరెస్ట్- ప్రతిపాదనను తిరస్కరించిన ముద్రగడ

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష కొనసాగుతోంది. ఆయన రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. పోలీసులు, వైద్యులు కలిసి ఆయనకు బలవంతంగా వైద్యం అందించేందుకు ప్రయత్నించగా ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ దృశ్యాలను కొన్ని టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి. అటు గోదావరి జిల్లాల్లో బంద్‌ కొనసాగుతోంది. కాపులు పలు చోట్ల రోడ్లపైకి వచ్చి బైఠాయించారు. పోలీసులు భారీగా మోహరించారు. ముద్రగడను పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ నేతల బృందాన్ని రాజమండ్రి ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. […]

బొత్స, ఉమ్మారెడ్డి, అంబటి అరెస్ట్- ప్రతిపాదనను తిరస్కరించిన ముద్రగడ
X

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష కొనసాగుతోంది. ఆయన రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. పోలీసులు, వైద్యులు కలిసి ఆయనకు బలవంతంగా వైద్యం అందించేందుకు ప్రయత్నించగా ఆయన తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ దృశ్యాలను కొన్ని టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి. అటు గోదావరి జిల్లాల్లో బంద్‌ కొనసాగుతోంది. కాపులు పలు చోట్ల రోడ్లపైకి వచ్చి బైఠాయించారు. పోలీసులు భారీగా మోహరించారు.

ముద్రగడను పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ నేతల బృందాన్ని రాజమండ్రి ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొత్ససత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు తదితరులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీక్ష చేస్తున్న ముద్రగడను జిల్లా ఎస్పీకలిశారు. దీక్ష విరమిస్తే సీబీఐ విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. అయితే ఎస్పీ రవిప్రకాష్ ప్రతిపాదనను ముద్రగడ తిరస్కరించారు. వెంటనే అరెస్ట్ చేసిన కాపులను విడుదల చేసి కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Click on Image to Read:

chiru-chandrababu

ttdp

purandeswari

tdp-kapu-leaders

babu

sakshi-ganta-chinarajappa

kommineni-sakhi

buggana-rajendranath-reddy

ys-jagan

sakshi paper

tuni-train-incident

bramhini

minister-narayana

ts-congress

tdp-mla-madhava-naidu

First Published:  11 Jun 2016 1:32 AM GMT
Next Story