Telugu Global
NEWS

కాంగ్రెస్ నేత‌ల‌కు షోకాజ్‌లు!

వ‌రుస‌పెట్టి కారెక్కుతున్న సొంత పార్టీ నేత‌ల‌ను నిలువ‌రించేందుకు కాంగ్రెస్ పార్టీ న‌డుం బిగించింది. న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నిన్న ఎంపీ గుత్తాతోపాటు, వినోద్‌, వివేక్‌, పొన్నం త‌దిత‌రులతో మాట్లాడిన విష‌యం తెలిసిందే! వెంట‌నే పార్టీలోనే ఉంటూపార్టీకి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న వారిపైనా దృష్టి సారించింది. సీనియ‌ర్ నేత‌ పాల్వాయి గోవ‌ర్ద‌న్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెప‌ల్లి మోహ‌న్‌ల‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతూనే.. టీఆర్ ఎస్ పార్టీకి […]

కాంగ్రెస్ నేత‌ల‌కు షోకాజ్‌లు!
X
వ‌రుస‌పెట్టి కారెక్కుతున్న సొంత పార్టీ నేత‌ల‌ను నిలువ‌రించేందుకు కాంగ్రెస్ పార్టీ న‌డుం బిగించింది. న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నిన్న ఎంపీ గుత్తాతోపాటు, వినోద్‌, వివేక్‌, పొన్నం త‌దిత‌రులతో మాట్లాడిన విష‌యం తెలిసిందే! వెంట‌నే పార్టీలోనే ఉంటూపార్టీకి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న వారిపైనా దృష్టి సారించింది. సీనియ‌ర్ నేత‌ పాల్వాయి గోవ‌ర్ద‌న్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెప‌ల్లి మోహ‌న్‌ల‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతూనే.. టీఆర్ ఎస్ పార్టీకి కోవ‌ర్టులా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ జానారెడ్డిని సీనియ‌ర్ నేత పాల్వాయి గోవ‌ర్ద‌న్ రెడ్డి విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. అలాగే క‌రీంన‌గ‌ర్ డీసీసీ అధ్య‌క్షుడిపై చేసిన వ్యాఖ్య‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే ఆరెప‌ల్లి మోహ‌న్ కు సైతం అధిష్టానం తాఖీదులు జారీ చేసింది. ఈ నెల 17లోపు వారు చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని సూచించింది. వీరితోపాటు పార్టీని వీడుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నేత‌ల‌పైనా పార్టీ దృష్టి సారించింది. వీరిలో కొంద‌రిని హెచ్చ‌రించాల‌ని, మ‌రికొంద‌రికి షోకాజ్ నోటీసులు జారీ చేయాల‌ని నిర్ణ‌యించింది.
బ‌హిరంగ స్టేట్‌మెంట్ల‌పై సీరియ‌స్‌..!
సీనియ‌ర్లు పార్టీ గురించి చెడుగా మాట్లాడితే దాని ప్ర‌భావం తీవ్రంగా ఉంటోంద‌ని ఉత్త‌మ్ ఇటీవ‌ల అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇలాంటి వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ప‌రిగ‌ణించాల‌ని అధిష్టానం ఉత్త‌మ్‌కు సూచించిన‌ట్లు స‌మాచారం. ప్రెస్ మీట్లు, పార్టీ వ్య‌తిరేక కామెంట్ల‌పై గ‌ట్టి ఆంక్ష‌లు విధించాల‌ని చెప్పిన‌ట్లు తెలిసింది. మొన్న‌టి భేటీలో జైపాల్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. త‌ర‌చుగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసేవారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న సంకేతాలు వెళితేనే.. మిగిలిన వారు దారికి వ‌స్తార‌ని అధిష్టానం భావిస్తోంది. ఇటీవ‌ల టీపీసీసీ అధినేత‌పై మాజీమంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు పెద్ద‌దుమారాన్నే రేపాయి. త‌న‌కు మాత్ర‌మే షోకాజ్ ఎలా ఇస్తార‌ని, జానారెడ్డిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన పాల్వాయి సంగ‌తేంటి? అని ప్ర‌శ్నించిన సంగతి తెలిసిందే! కోమ‌టిరెడ్డి విష‌యంలో ఆయ‌న సోద‌రుడు రాజ‌గోపాల్ రెడ్డి తో స‌హా ప‌లువురు వెంక‌ట‌రెడ్డినే త‌ప్పుబ‌ట్టారు. దీంతో పార్టీకి వివ‌ర‌ణ ఇచ్చేందుకు వెంక‌ట‌రెడ్డి సిద్ధ‌మ‌వుతున్నారు. ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, మిర్యాల‌గూడ ఎమ్మెల్యే భాస్క‌ర్ రావులు కూడా పార్టీ మార‌తార‌ని తాను అనుకోవ‌డం లేద‌ని ఉత్త‌మ్ ప్ర‌క‌టించ‌డం విశేషం.
First Published:  11 Jun 2016 7:02 PM GMT
Next Story