Telugu Global
Cinema & Entertainment

ఒక్క అమ్మాయి సందీప్ కు ఏం మిగిల్చింది...?

కొన్ని క‌థ‌లు  వినేట‌ప్పుడు ఊహించుకోవ‌డానికి అద్భుతుంగా వుంటాయి. కానీ అదే ద‌ర్శ‌కుడు క‌థ‌ను తెర‌కెక్కించ‌డంలో త‌డ‌బ‌డితే ఎలా వుంటుంది అంటే  క‌చ్చితంగా  ఒక్క అమ్మాయి త‌ప్ప చిత్రంలా వుంటుది.   సీనియ‌ర్ కెమెరా మెన్ ఛోటా కే నాయుడు స‌హాయ స‌హకారాల‌తో  ద‌ర్శ‌కుడు రాజ  సింహా   .. ఒక్క అమ్మాయి త‌ప్ప చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. హీరో త‌న మేన‌ల్లుడు సందీప్ కిష‌న్ కోసం త‌న‌కు చేత‌నైనంత  సహాయం అందిస్తూనే వున్నాడు. అయితే  ఒక్క అమ్మాయి త‌ప్ప క‌థలో కొత్త ద‌నం […]

ఒక్క అమ్మాయి సందీప్ కు ఏం మిగిల్చింది...?
X

కొన్ని క‌థ‌లు వినేట‌ప్పుడు ఊహించుకోవ‌డానికి అద్భుతుంగా వుంటాయి. కానీ అదే ద‌ర్శ‌కుడు క‌థ‌ను తెర‌కెక్కించ‌డంలో త‌డ‌బ‌డితే ఎలా వుంటుంది అంటే క‌చ్చితంగా ఒక్క అమ్మాయి త‌ప్ప చిత్రంలా వుంటుది. సీనియ‌ర్ కెమెరా మెన్ ఛోటా కే నాయుడు స‌హాయ స‌హకారాల‌తో ద‌ర్శ‌కుడు రాజ సింహా .. ఒక్క అమ్మాయి త‌ప్ప చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. హీరో త‌న మేన‌ల్లుడు సందీప్ కిష‌న్ కోసం త‌న‌కు చేత‌నైనంత సహాయం అందిస్తూనే వున్నాడు.

అయితే ఒక్క అమ్మాయి త‌ప్ప క‌థలో కొత్త ద‌నం చూపించే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికి.. క‌థ‌నం ప‌రంగా.. ఘోరంగా ఫెయిల్ అయ్యింది. బెసిక్ లాజిక్స్ వ‌దిలేసి క‌థ‌ను చేశాడ‌నే విమ‌ర్శ‌ల వెల్లువ వినిపిస్తుంది. తీవ్ర‌వాదం నేప‌థ్యంగా హీరోను మాన‌వ బాంబుగా వాడుకుని హైటెక్ సిటిని పేల్చి వేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తారు. హీరోకు తెలియ‌కుండా.. హీరో తీవ్ర‌వాదుల‌కు మాన‌వ బాంబుగా మారాల్సి రావ‌డం .. అదే ఉగ్ర‌వాదులు బంధించిన త‌న ప్రేయ‌సిని కాపాడుకోవ‌డం అనేది మేయిన్ పాయింట్. ఇదే హీరోను ఈ చిత్రం చేయ‌డానికి ప్రేరేపించి వుంటుంది. కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ కు స్క్రీన్ ప్లే ద‌మ్ము చూపితేనే బండి న‌డుస్తుంది. లేక పోతే చ‌తిక‌ల ప‌డిపోవ‌డం ఖాయం. ఈ మ‌ధ్య వ‌చ్చిన క్ష‌ణం మాదిరి స్క్రీన్ ప్లే వుంటేనే బొమ్మ గిర్రునా తిరుగుద్ది. క‌ట్ చేస్తే అది ఒక్క అమ్మాయి త‌ప్ప చిత్రానికి లోపించ‌డం పెద్ద మైన‌స్.

ఫైన‌ల్ గా సందీప్ కిష‌న్ కు ఈ చిత్రం కొత్త‌గా ఏం తెచ్చింది. ఏం ఇచ్చింది. ఏ బాధ్య‌త పెంచింది. అలా క‌మ‌ర్షియ‌ల్ లెక్కలు చూస్తే చివ‌ర‌కు ఏమి మిగిల్లేద‌నే చెప్పాలి. కేప్ట‌న్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్ట‌ర్ క‌థ , క‌థ‌నాల మీద శ్ర‌ద్ద‌గా ప‌ని చేయ‌క పోతే.. అంద‌రికి మైన‌సే. చివ‌రికి సందీప్ కు గుండు సున్న మిగిల్చిందనే చెప్పాలి మ‌రి.

First Published:  14 Jun 2016 12:06 AM GMT
Next Story