Telugu Global
Cinema & Entertainment

మనసున్న మారాజు... ఈ క్రేజీ దర్శకుడు

సినిమా జనాలంతా ఒకేలా ఉండరు. కేవలం పనిలోనే మునిగిపోతారని, సామాజిక బాధ్యత అనేదే ఉండదని, సాయంత్రాలు సరదాలు, పార్టీలకు మాత్రమే పరిమితమవుతారనే అపోహ చాలామందిలో ఉంది. కానీ సినీజనాలంతా ఒకేలా ఉండరు. ఇంకా చెప్పాలంటే తమకు తోచిన రీతిలో సమాజాన్ని ఆదుకోవాలని పరిశ్రమకు చెందిన ప్రతి వ్యక్తి భావిస్తుంటాడు. కాకపోతే… కాలం, ఖర్చు కలిసిరావాలి. ఇక్కడ మాత్రం ఓ స్టార్ డైరక్టర్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తాజాగా క్యాన్సర్ […]

మనసున్న మారాజు... ఈ క్రేజీ దర్శకుడు
X
సినిమా జనాలంతా ఒకేలా ఉండరు. కేవలం పనిలోనే మునిగిపోతారని, సామాజిక బాధ్యత అనేదే ఉండదని, సాయంత్రాలు సరదాలు, పార్టీలకు మాత్రమే పరిమితమవుతారనే అపోహ చాలామందిలో ఉంది. కానీ సినీజనాలంతా ఒకేలా ఉండరు. ఇంకా చెప్పాలంటే తమకు తోచిన రీతిలో సమాజాన్ని ఆదుకోవాలని పరిశ్రమకు చెందిన ప్రతి వ్యక్తి భావిస్తుంటాడు. కాకపోతే… కాలం, ఖర్చు కలిసిరావాలి. ఇక్కడ మాత్రం ఓ స్టార్ డైరక్టర్ తన పెద్ద మనసును చాటుకున్నాడు.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తాజాగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 10 మంది చిన్నారులను దత్తత తీసుకుని తన గొప్ప మనస్సును చాటుకున్నారు. దీనిపై రోహిత్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతం పది మంది చిన్నారులను దత్తత తీసుకున్నానని, వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, అలాగే దగ్గరుండి వారి చికిత్సకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. రోహిత్ శెట్టి ఏటా కొంతమంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను దత్తత తీసుకుంటూ తన సేవాగుణాన్ని చాటుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఆ చిన్నారులను దత్తత తీసుకున్నారు.
First Published:  14 Jun 2016 12:06 AM GMT
Next Story