Telugu Global
Cinema & Entertainment

ప్రియ‌మ‌ణి  కొత్త రూమ‌ర్స్ కు డోర్స్ తెరిచింది..!

ద‌ర్శ‌క జ‌క్క‌న్న రాజ‌మౌళి చెక్కిన  బాహుబ‌లి చిత్రం దేశ‌వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో  తెలిసిందే. క‌ట్ చేస్తే ఈ చిత్రంలో  చిన్న రోల్ ద‌క్కినా  జ‌న్మ జ‌న్మ‌ల అదృష్టం అనుకుంటున్న న‌టీ న‌టుల‌కు కొద‌వ‌లేదు ఇప్పుడు. అయితే తాజాగా  అటువంటి ల‌క్  ప్రియ‌మ‌ణికి చిక్కింది అనే రూమ‌ర్స్  వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం  ఫిల్మ్ సిటి లో   బాహుబ‌లి  సీక్వెల్ క్లైమాక్స్ ఫైట్ ను  చీత్రిక‌రిస్తున్నారు.  దాదాపు 3 నెల‌ల పాటు   ఈ పోరాట స‌న్నివేశాల షూటింగ్ నిర్విరామంగా జ‌రుగుతాయ‌ని  […]

ప్రియ‌మ‌ణి  కొత్త రూమ‌ర్స్ కు డోర్స్ తెరిచింది..!
X

ద‌ర్శ‌క జ‌క్క‌న్న రాజ‌మౌళి చెక్కిన బాహుబ‌లి చిత్రం దేశ‌వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. క‌ట్ చేస్తే ఈ చిత్రంలో చిన్న రోల్ ద‌క్కినా జ‌న్మ జ‌న్మ‌ల అదృష్టం అనుకుంటున్న న‌టీ న‌టుల‌కు కొద‌వ‌లేదు ఇప్పుడు. అయితే తాజాగా అటువంటి ల‌క్ ప్రియ‌మ‌ణికి చిక్కింది అనే రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఫిల్మ్ సిటి లో బాహుబ‌లి సీక్వెల్ క్లైమాక్స్ ఫైట్ ను చీత్రిక‌రిస్తున్నారు. దాదాపు 3 నెల‌ల పాటు ఈ పోరాట స‌న్నివేశాల షూటింగ్ నిర్విరామంగా జ‌రుగుతాయ‌ని స‌మాచారం .

అయితే సోమ‌వారం బాహుబ‌లి 2 షూటింగ్ యూనిట్ లో ప్రియ‌మ‌ని క‌నిపించ‌డం హాట్ టాపిక్ అయ్యింది. గ‌తంలో రాజ‌మౌళి జూనియ‌ర్ ఎన్టీఆర్ తో చేసిన య‌మ‌దొంగ చిత్రంలో న‌టించింది. అప్ప‌టి నుంచి డైరెక్ట‌ర్ రాజ‌మౌళితో మంచి క‌మ్యునికేష‌న్ క‌లిగి వున్న‌ట్లు తెలుస్తుంది. ప్రియ‌మ‌ణి త‌న‌ను బాహుబ‌లి 2 షూటింగ్ చూడ‌టానికి అనుమ‌తించినంద‌కు చిత్ర యూనిట్ కు ధ‌న్య‌వాదాలు అని ట్విట్ చేసింది. అయితే ఏ ప‌ని లేకుండా.. కేవ‌లం షూటింగ్ చూడ‌టానికి చెన్నై నుంచి ప్రియ‌మ‌ణి వ‌స్తుందా..? రావాల్సిన అవ‌స‌రం ఏమిటి..? క‌చ్చితంగా బాహుబ‌లి 2 లో ప్రియ‌మ‌ణికి డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ఏదో ఒక రోల్ ఆఫ‌ర్ చేసే వుంటార‌నే టాక్ వినిపిస్తుంది. ఇది నిజ‌మైతే ప్రియ‌మ‌ణి న‌క్క‌ను తొక్కిన‌ట్లే మ‌రి.

First Published:  14 Jun 2016 5:14 AM GMT
Next Story