Telugu Global
National

అది ఆయ‌న ఇంగ్లీషు కాదు... మోడీ టెక్నాలజీని బాగా వాడేస్తున్నారు!

ప్ర‌ధాని మోడీ విదేశాల‌కు వెళ్లిన‌పుడు అన‌ర్గ‌ళంగా, భావ‌స్ఫోర‌కంగా  ఆంగ్లంలో మాట్లాడుతూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు. అయితే అదంతా ఆయన ఇంగ్లీషు ప్రావీణ్యం కాద‌ని టెలీప్రాంప్ట‌ ర్ల‌ పుణ్య‌మేన‌నే క‌థ‌నాలు మీడియాలో క‌న‌బ‌డుతున్నాయి. ఈ అంశంపై సామాజిక మాధ్య‌మాల్లో ఇంత‌కుముందు నుండే క‌థ‌నాలు, కామెంట్లు విన‌బ‌డుతుండ‌గా,  ఇటీవ‌ల మోడీ అమెరికా పార్ల‌మెంటుని ఉద్దేశించి చేసిన ప్ర‌సంగంతో అవి మ‌రింత ఎక్కువ‌గా వ్యాపించాయి. అమెరికన్ కాంగ్రెస్ ప్ర‌సంగంలో మోడీ టెలీప్రాంప్ట‌ర్ల‌ను వాడార‌ని, అందుకే ఆంగ్లంలో అంత చ‌క్క‌గా, మంచి ప‌దాలతో, భావోద్రేకంతో […]

అది ఆయ‌న ఇంగ్లీషు కాదు... మోడీ టెక్నాలజీని బాగా వాడేస్తున్నారు!
X

ప్ర‌ధాని మోడీ విదేశాల‌కు వెళ్లిన‌పుడు అన‌ర్గ‌ళంగా, భావ‌స్ఫోర‌కంగా ఆంగ్లంలో మాట్లాడుతూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు. అయితే అదంతా ఆయన ఇంగ్లీషు ప్రావీణ్యం కాద‌ని టెలీప్రాంప్ట‌ ర్ల‌ పుణ్య‌మేన‌నే క‌థ‌నాలు మీడియాలో క‌న‌బ‌డుతున్నాయి. ఈ అంశంపై సామాజిక మాధ్య‌మాల్లో ఇంత‌కుముందు నుండే క‌థ‌నాలు, కామెంట్లు విన‌బ‌డుతుండ‌గా, ఇటీవ‌ల మోడీ అమెరికా పార్ల‌మెంటుని ఉద్దేశించి చేసిన ప్ర‌సంగంతో అవి మ‌రింత ఎక్కువ‌గా వ్యాపించాయి. అమెరికన్ కాంగ్రెస్ ప్ర‌సంగంలో మోడీ టెలీప్రాంప్ట‌ర్ల‌ను వాడార‌ని, అందుకే ఆంగ్లంలో అంత చ‌క్క‌గా, మంచి ప‌దాలతో, భావోద్రేకంతో ప్ర‌సంగించార‌ని సామాజిక మాధ్య‌మాల్లో విస్తృతంగా ప్ర‌చార‌మైంది. అంతేకాదు, ఆయ‌న టెలీప్రాంప్ట‌ర్ల స‌హాయంతో ప్ర‌సంగించ‌డాన్ని నిర్దారించే ఫొటోలు సైతం సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేశాయి.

మోడీ ప్ర‌సంగిస్తున్న వేదిక మీద టెలీప్రాంప్ట‌ర్లు ఫొటోల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. టెలీ ప్రాంప్ట‌ర్ మానిట‌ర్ పై వ‌క్త చ‌ద‌వాల్సిన విష‌యాలు స్క్రోల్ అవుతూ క‌న‌బ‌డుతుంటాయి కానీ, ప్రేక్ష‌కుల‌కు మాత్రం వ‌క్త త‌మ‌నే చూస్తున్నాడ‌నే భ్ర‌మ క‌లుగుతుంది. వ‌క్త ప్ర‌సంగం మ‌ధ్య‌లో తీసుకునే విరామాలకు అనుగుణంగా ఆప‌రేట‌ర్ వాక్యాల‌ను అత‌నిముందు ప్ర‌త్య‌క్ష్య‌మ‌య్యేలా చేస్తుంటాడు. సామాజిక మాధ్య‌మాల్లో ఈ అంశాలు ప్ర‌చారంలోకి వ‌చ్చాక దీనిపై మీడియాలోనూ క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

2014లో భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ‌ ఇస్రో నుండి పిఎస్ఎల్‌వి ప్ర‌యోగ స‌మ‌యంలో మొద‌టిసారి మోడీ టెలీ ప్రాంప్ట‌ర్ల‌ను వాడిన‌ట్టుగా ఆ క‌థ‌నాలు చెబుతున్నాయి. త‌రువాత కాలంలో విదేశాల్లో ప్ర‌సంగిస్తున్న స‌మ‌యాల్లో ఆయ‌న వీటిని విరివిగా ఉప‌యోగించుకుంటున్నారు. చైనా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంలో మంచి ఆంగ్లంలో మాట్లాడిన మోడీ, ఆ వెంట‌నే జ‌రిగిన ప్ర‌శ్నోత్త‌రాల కార్య‌క్ర‌మంలో మొద‌టి ప్ర‌శ్న‌కు జ‌వాబునే హిందీలో మొద‌లుపెట్ట‌డం పై కూడా సామాజిక మాధ్య‌మాల్లో క‌థ‌నాలు వ‌చ్చాయి.

First Published:  13 Jun 2016 7:20 PM GMT
Next Story