Telugu Global
CRIME

ప్రియుడికోసం తండ్రి హత్య

తమిళనాడులో కంప్యూటర్‌ సైన్స్‌ డిగ్రీ చేస్తున్న మహాలక్ష్మి తన బాయ్‌ ఫ్రెండ్‌కు బైక్‌ కొనివ్వడానికి తండ్రి ఎకౌంట్‌ నుంచి దొంగతనంగా డబ్బుతీసుకుంది. ఆ విషయం తండ్రికి తెలియడంతో తండ్రి కూతుళ్ల మధ్య పెద్ద గొడవ జరిగింది. తండ్రి మీద కోపంతో మహాలక్ష్మి ఇల్లు వదిలి బాయ్‌ ఫ్రెండ్‌ దగ్గరకు వెళ్లిపోయింది. వెళుతూవెళుతూ పెద్దమొత్తంలో డబ్బు పట్టుకుపోయింది. మహాలక్ష్మి తండ్రి పెద్ద వ్యాపారి. కాబట్టి తమ పెళ్లికి ఎక్కడ అడ్డుపడతాడోనని బాయ్‌ ఫ్రెండ్‌ సతీష్‌కు లక్షాయాభైవేల రూపాయలు ఇచ్చి […]

ప్రియుడికోసం తండ్రి హత్య
X

తమిళనాడులో కంప్యూటర్‌ సైన్స్‌ డిగ్రీ చేస్తున్న మహాలక్ష్మి తన బాయ్‌ ఫ్రెండ్‌కు బైక్‌ కొనివ్వడానికి తండ్రి ఎకౌంట్‌ నుంచి దొంగతనంగా డబ్బుతీసుకుంది. ఆ విషయం తండ్రికి తెలియడంతో తండ్రి కూతుళ్ల మధ్య పెద్ద గొడవ జరిగింది. తండ్రి మీద కోపంతో మహాలక్ష్మి ఇల్లు వదిలి బాయ్‌ ఫ్రెండ్‌ దగ్గరకు వెళ్లిపోయింది. వెళుతూవెళుతూ పెద్దమొత్తంలో డబ్బు పట్టుకుపోయింది.

మహాలక్ష్మి తండ్రి పెద్ద వ్యాపారి. కాబట్టి తమ పెళ్లికి ఎక్కడ అడ్డుపడతాడోనని బాయ్‌ ఫ్రెండ్‌ సతీష్‌కు లక్షాయాభైవేల రూపాయలు ఇచ్చి ఎవరిచేతనైనా తండ్రిని హత్య చేయించమని చెప్పింది. ఆ డబ్బుతో సతీష్‌ కిరాయి రౌడీలను పంపి మహాలక్ష్మి తండ్రిని హత్య చేయించాడు. గత నెలలో జరిగిన ఈ హత్యను పోలీసులు సీరియస్‌గా పరిశోధిస్తూ వుండటంతో ఇక ఎలాగో దొరికిపోతామని మహాలక్ష్మి, ఆమె బాయ్‌ ఫ్రెండ్ సతీష్‌ కోయంబత్తూర్‌ కోర్టులో లొంగిపోయారు.

First Published:  15 Jun 2016 2:55 AM GMT
Next Story