Telugu Global
Cinema & Entertainment

ఆ సినిమా నుంచి తప్పుకున్న మహేష్...

బ్రహ్మోత్సవం భారీ పరాజయం పొందడంతో పివిపి బ్యానర్ లో మరో సినిమా చేయడానికి మహేష్ జంకుతున్నాడట. నిజానికీ ఈ బ్యానర్ లో వంశీ పైడిపల్లి హీరోగా ఓ సినిమా చేసేందుకు ఎప్పుడో అంగీకరించాడు మహేష్. ఇప్పుడు ఆ సినిమానే అనుమానంలో పడిందని తెలుస్తోంది. ప్రస్తుతం వినబడుతున్న కథనాల ప్రకారం మహేష్ ఆ సినిమా నుండి తప్పుకున్నాడని , వంశీ దర్శకత్వంలో సినిమా చేయడం లేదని తెలుస్తోంది . మురుగదాస్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు […]

ఆ సినిమా నుంచి తప్పుకున్న మహేష్...
X
బ్రహ్మోత్సవం భారీ పరాజయం పొందడంతో పివిపి బ్యానర్ లో మరో సినిమా చేయడానికి మహేష్ జంకుతున్నాడట. నిజానికీ ఈ బ్యానర్ లో వంశీ పైడిపల్లి హీరోగా ఓ సినిమా చేసేందుకు ఎప్పుడో అంగీకరించాడు మహేష్. ఇప్పుడు ఆ సినిమానే అనుమానంలో పడిందని తెలుస్తోంది. ప్రస్తుతం వినబడుతున్న కథనాల ప్రకారం మహేష్ ఆ సినిమా నుండి తప్పుకున్నాడని , వంశీ దర్శకత్వంలో సినిమా చేయడం లేదని తెలుస్తోంది . మురుగదాస్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్. అలాగే దాని తర్వాత పూరి జగన్నాద్ లేదా త్రివిక్రమ్ లతో సినిమా చేయొచ్చని అంటున్నారు . ఇప్పటికే పూరి జనగణమన అనే టైటిల్ ని రిజిస్టర్ కూడా చేయించిన విషయం తెలిసిందే . అయితే పూరీకి కూడా మహేష్ అవకాశం ఇవ్వకపోవచ్చని… ప్రస్తుతం ఒప్పుకున్న మురుగదాస్ ప్రాజెక్టు కంప్లీట్ అయిన వెంటనే… త్రివిక్రమ్ తో కలిసి ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేసే అవకాశముందని ఇండస్ట్రీలో పుకార్లు వినిపిస్తున్నాయి. మరోవైపు వంశీ పైడిపల్లి… అఖిల్ సినిమాకు ఫిక్స్ అవ్వడం కూడా ఈ రూమర్లకు ఊతమిచ్చింది. నిజానికి ఊపిరి సినిమా కంప్లీట్ అయిన వెంటనే… మహేష్ తో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకొస్తాడని అంతా అనుకున్నారు. కానీ బ్రహ్మోత్సవం ఫ్లాపుతో లెక్కలన్నీ మారిపోయాయి. మహేష్-వంశీ ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
First Published:  15 Jun 2016 11:29 PM GMT
Next Story