Telugu Global
Cinema & Entertainment

క‌బాలీ రిలీజ్ డేట్ ప‌క్కా అంటున్నారు..!

కొచ్చాడియ‌న్, లింగ ..ర‌జ‌నీకాంత్ న‌టించిన చిత్రాలు.  రెండు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర  డిజాస్ట‌ర్స్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే ఈ రెండు చిత్రాలు రిలీజ్ లు కూడా  ముందుగా ప్ర‌క‌టించిన స‌మ‌యంలో చేయ‌లేదు.  రెండు మూడు సార్టు డేట్ పోస్ట్ పోన్ చేసుకుంటు వ‌చ్చారు. క‌ట్ చేస్తే..  తాజాగా  రంజిత్  డైరెక్ష‌న్ లో వ‌స్తున్న క‌బాలి చిత్రం డేట్ ముందు జూలై 1  రిలీజ్ అన్నారు. క‌ట్ చేస్తే ఈ చిత్రం  రంజాన్  పండ‌గ కార‌ణంగా వాయి వేశారు. అయితే […]

క‌బాలీ రిలీజ్ డేట్ ప‌క్కా అంటున్నారు..!
X

కొచ్చాడియ‌న్, లింగ ..ర‌జ‌నీకాంత్ న‌టించిన చిత్రాలు. రెండు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్స్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే ఈ రెండు చిత్రాలు రిలీజ్ లు కూడా ముందుగా ప్ర‌క‌టించిన స‌మ‌యంలో చేయ‌లేదు. రెండు మూడు సార్టు డేట్ పోస్ట్ పోన్ చేసుకుంటు వ‌చ్చారు. క‌ట్ చేస్తే.. తాజాగా రంజిత్ డైరెక్ష‌న్ లో వ‌స్తున్న క‌బాలి చిత్రం డేట్ ముందు జూలై 1 రిలీజ్ అన్నారు. క‌ట్ చేస్తే ఈ చిత్రం రంజాన్ పండ‌గ కార‌ణంగా వాయి వేశారు.

అయితే ఈ మ‌ధ్య ఆడియో రిలీజ్ కూడా జ‌రిగింది. ర‌జ‌నీకాంత్ ఆనారోగ్య కార‌ణంగా అటెండ్ కాలేక పోవ‌డంతో.. ట్రైల‌ర్ రిలీజ్ కాలేదు. అయితే ఆడియ‌న్స్ మ‌ళ్లీ క‌న్ఫ్యూజ‌న్ ప‌డ‌కుండా వుండ‌టానికి . క‌బాలి రిలీజ్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. జూలై 15 న క‌బాలి ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తార‌ని కోలీవుడ్ స‌మ‌చారం. రంజాన్ పండ‌గ మాసంలో ముస్లీమ్ సోద‌రుల‌ సినిమాలు చూడ‌రనే కారణంతో వాయిదా వేశారు.

క‌బాలి చిత్రంలో ర‌జ‌నీకాంత్ మ‌లేసియ‌న్ బేస్డ్ గ్యాంగ్ స్ట‌ర్ గా న‌టిస్తున్నాడు. ఆ మ‌ధ్య విడుద‌ల చేసిన క‌బాలీ టీజ‌ర్ కు సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వ‌చ్చాయి. టీజ‌ర్ రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే 1 కోటి వ్యూస్ క్రాస్ చేసింది. నాలుగు రోజుల‌కు రెండు కోట్ల వ్యూస్ క్రాస్ చేసింది. ప్ర‌స్తుతం 3 కోట్ల వ్యూస్ కు ద‌గ్గ‌ర‌గా ఉంది. దీన్ని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు ర‌జ‌నీకాంత్ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు .. స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఏ రేంజ్ లో వేయిట్ చేస్తున్నాడో. రాధిక ఆప్టే ర‌జ‌నీ స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టిస్తున్నారు.

First Published:  16 Jun 2016 7:04 AM GMT
Next Story