Telugu Global
Cinema & Entertainment

జూనియ‌ర్  ఎన్టీఆర్ కు కొత్త  త‌ల‌నొప్పి... పాస్ అవుతాడో..?ఫెయిల్ అవుతాడో..?

కార‌ణాలు ఏమైతేనేమి  జూనియ‌ర్ ఎన్టీఆర్ ను నంద‌మూరి  హీరోగా అంద‌రు చూడ‌టం లేదు.  ప‌ర్స‌న‌ల్ రీజ‌న్స్ ఏవో ఉండోచ్చు  అనేది తేట తెల్లం చేశారు. ఇటీవ‌ల  మా అవార్డ్స్ ఫంక్ష‌న్ లో   చిరంజీవి మా  జ‌న‌రేష‌న్ హీరోల‌కు  ఆరాధ్యుడు ..ప్రేర‌ణ అని  ఓపెన్ గా చెప్పేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు  అటువంటి   మాట ఆయ‌న నోట రాలేదు.   కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్ త‌ను న‌టించిన ఒక చిత్రం లైవ్ లో..  డ్యాన్స్ గురించి ఏదో మాట వ‌స్తే.. చిరంజీవి  […]

జూనియ‌ర్  ఎన్టీఆర్ కు కొత్త  త‌ల‌నొప్పి... పాస్ అవుతాడో..?ఫెయిల్ అవుతాడో..?
X

కార‌ణాలు ఏమైతేనేమి జూనియ‌ర్ ఎన్టీఆర్ ను నంద‌మూరి హీరోగా అంద‌రు చూడ‌టం లేదు. ప‌ర్స‌న‌ల్ రీజ‌న్స్ ఏవో ఉండోచ్చు అనేది తేట తెల్లం చేశారు. ఇటీవ‌ల మా అవార్డ్స్ ఫంక్ష‌న్ లో చిరంజీవి మా జ‌న‌రేష‌న్ హీరోల‌కు ఆరాధ్యుడు ..ప్రేర‌ణ అని ఓపెన్ గా చెప్పేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అటువంటి మాట ఆయ‌న నోట రాలేదు. కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్ త‌ను న‌టించిన ఒక చిత్రం లైవ్ లో.. డ్యాన్స్ గురించి ఏదో మాట వ‌స్తే.. చిరంజీవి పేరు ప్ర‌స్థావ‌న వ‌స్తే.. అస‌లు చిరంజీవి ఎవ‌రు అంటూ ప్ర‌శ్నించి అంద‌ర్నీ ఆశ్చర్య ప‌రిచాడు.

క‌ట్ చేస్తే కాలం గ‌డిచింది. ఎన్నో మార్పులు. అటు తెలుగు దేశం పార్టీలో గానీ.. నంద‌మూరి కుటుంబంలోగాని త‌గిన ప్రాధ్యాన్యం ల‌భించ‌లేదు. (ఇవ్వ‌డం లేదు అంటే క‌రెక్ట్ ). దీంతో ఎన్టీఆర్ కు త‌న సొంత ఫ్యాన్ అసోసియోష‌న్ ను బ‌ల‌ప‌రుచుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. చిరంజీవిని పోగిడిన‌ప్ప‌టి నుంచి.. యాంటీ మెగా ఫ్యాన్స్ అంద‌రు సోష‌ల్ నెట్ వ‌ర్క్ వేదిక‌గా .. జూనియ‌ర్ ఎన్టీఆర్ పై విమ‌ర్శ‌ల దాడులు చేస్తున్నారు.

దీంతో యంగ్ టైగ‌ర్ కూడా అ లెర్ట్ అయ్యాడు. దీనిలో బాగంగా జ‌న‌తా గ్యారేజ్ షూటింగ్ ల్లో ఫ్యాన్స్ ను క‌ల‌వ‌డం ప్రారంభించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 4 వేల మందిని క‌లిసి న‌ట్లు తెలుస్తుంది. అటు బాల‌య్య అభిమానుల నుంచి.. ఇటు సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో త‌న గురించి నెగిటివ్ గా వ‌స్తున్న ఎటాక్స్ ను అడ్డుకోవాడానికి అభిమానుల్ని ఎన్టీఆరే స్వ‌యంగా సిద్దం చేస్తున్నాడ‌నేది ఫిల్మ్ న‌గ‌ర్ టాక్. మ‌రి ఈ పోరాటంలో జూనియ‌ర్ ఎంత వ‌ర‌కు నెగ్గుతాడో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఒంటిరి పోరాటం అంతా తేలిక కాదు క‌దా.!

First Published:  16 Jun 2016 3:20 AM GMT
Next Story