Telugu Global
NEWS

గుత్తా కండువా ఎందుకు క‌ప్పుకోలేదు?

నిన్న అధికార పార్టీలో చేరారు న‌ల్ల‌గొండ ఎమ్మెల్యే గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి. ఆయ‌న్ను సీఎం కేసీఆర్ స్వ‌యంగా పార్టీలోకి ఆహ్వానించారు. గుత్తాతోపాటు మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు భాస్క‌ర రావు (మిర్యాల‌గూడ‌), ర‌వీంద్ర‌నాయ‌క్ (దేవ‌ర‌కొండ‌), మాజీఎంపీ వివేక్‌, మాజీ మంత్రి  వినోద్‌లు పార్టీలో చేరారు. వీరంద‌రినీ స్వ‌యంగా సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. త‌రువాత గ్రూప్ ఫొటో కూడా దిగారు. ఈ ఫొటోలో తేడా ఏంటంటే.. గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి మెడ‌లో గులాబీ కండువా లేక‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చానీయాంశంగా […]

గుత్తా కండువా ఎందుకు క‌ప్పుకోలేదు?
X
నిన్న అధికార పార్టీలో చేరారు న‌ల్ల‌గొండ ఎమ్మెల్యే గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి. ఆయ‌న్ను సీఎం కేసీఆర్ స్వ‌యంగా పార్టీలోకి ఆహ్వానించారు. గుత్తాతోపాటు మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు భాస్క‌ర రావు (మిర్యాల‌గూడ‌), ర‌వీంద్ర‌నాయ‌క్ (దేవ‌ర‌కొండ‌), మాజీఎంపీ వివేక్‌, మాజీ మంత్రి వినోద్‌లు పార్టీలో చేరారు. వీరంద‌రినీ స్వ‌యంగా సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. త‌రువాత గ్రూప్ ఫొటో కూడా దిగారు. ఈ ఫొటోలో తేడా ఏంటంటే.. గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి మెడ‌లో గులాబీ కండువా లేక‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చానీయాంశంగా మారింది. ఇదంతా ఏదో వ్యూహాత్మకంగా జ‌రిగింద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ముంద‌స్తుగా అంతా ఊహించిన‌ట్లుగానే గుత్తా పార్టీలో చేరిన‌ప్ప‌టికీ.. మెడ‌లో గులాబీ కండువా ఎందుకు వేసుకోలేద‌న్న‌దానిపై విభిన్న క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.
అన‌ర్హ‌త వేటు త‌ప్పించుకునేందుకా?
గుత్తా త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌లేదు. మ‌రోవైపు పార్టీకి గుడ్‌బై చెప్పినా.. దానిపై స్ప‌ష్ట‌త లేదు. అంటే.. పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌లో భాగంగా తీసుకునే చ‌ర్య‌ల నుంచి వ్యూహాత్మ‌కంగా త‌ప్పించుకునేందుకే ఇలా చేశార‌ని అంతా అనుకుంటున్నారు. ఆయ‌న కాంగ్రెస్ ద్వారా ఎంపికైన వ్య‌క్తి. ఇప్పుడు మ‌రో పార్టీతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇత‌నిపై అన‌ర్హ‌త వేటు వేసేందుకు పుష్క‌లంగా అవ‌కాశాలున్నాయి. కానీ, ఇత‌నిపై చ‌ర్య‌లు తీసుకునేముందు ఏపీలో టీడీపీలో చేరిన ఎంపీలపైనా చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంది. ఒక‌వేళ తీసుకున్నా..అంద‌రిపై ఒకేలా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ప‌రోక్షంగా టీడీపీని ఇబ్బంది పెట్ట‌డ‌మే. కేంద్రంలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ విష‌యాన్ని అంత‌దాకా తీసుకుపోనిస్తుందా? అన్న‌ది అనుమానమే! ఒక‌వేళ తీసుకెళ్లి.. వారిపై అన‌ర్హ‌త వేటుప‌డినా.. ఉప ఎన్నిక‌కు వెళ్లేందుకు వెన‌కాడేది లేద‌ని గుత్తా కు తెలంగాణ సీఎం భ‌రోసా ఇచ్చార‌ని స‌మాచారం. రెండేళ్లుగా తెలంగాణ‌లో ఏ ఎన్నిక వ‌చ్చినా.. ప్ర‌త్య‌ర్థుల‌కు డిపాజిట్లు లేకుండా చేస్తోన్న టీఆర్ ఎస్ న‌ల్ల‌గొండ పార్లమెంటుకు ఉప ఎన్నిక వచ్చినా ఎదుర్కొనేందుకు మాన‌సికంగా ఇప్ప‌టికే సిద్ధ‌మైంది. అయితే, విష‌యాన్ని అంత‌దాకా తీసుకుపోవ‌డం ఇష్టం లేక.. సాధ్య‌మైనంత జాప్యం చేయాల‌న్న‌దే కేసీఆర్ వ్యూహంగా క‌నిపిస్తోంది.

Click on Image to Read:

wife-change

amarnath-reddy

manikyala-rao

bhuma-nagi-reddy

C-Narasimha-Rao

rammurty-naidu-chandrababu-

danam-nagender

revanth-reddy

anam-ramanarayana-reddy

kommineni-amar

buggana-rajendranath-reddy-

vastu-tax

jc-diwakar-reddy

laxmi parvathi

devineni

kotamreddy-sridhar-reddy

gottipati

First Published:  15 Jun 2016 10:30 PM GMT
Next Story