Telugu Global
Cinema & Entertainment

పోర్న్ స్టార్ కంటతడి పెట్టిన వేళ...

తనను పోర్న్ స్టార్ అంటూ ఎన్నోసార్లు సంభోదించినప్పటికీ సన్నీలియోన్ ఎప్పుడూ బాధపడేలేదు. అప్పటి అనుభవాల్ని ఓ విలేకరి అడిగినప్పుడు కూడా సన్నీలియోన్ పెద్దగా చలించలేదు. తన గత చరిత్రకు సంబంధించి ఎన్నో విమర్శలు వచ్చినా ఆమె ధైర్యంగానే అన్నింటినీ ఎదుర్కొంది. కానీ ఒక్క ఉత్తరం.. ఒకే ఒక్క ఉత్తరం చదివిన తర్వాత మాత్రం సన్నీలియోన్ ఏడుపు ఆపుకోలేకపోయింది. అయితే అది బాధతో కాదు… ఆనంద బాష్పాలు. అవును… ఓ మహిళా అభిమాని రాసిన ఉత్తరం సన్నీని కదిలించింది. […]

పోర్న్ స్టార్ కంటతడి పెట్టిన వేళ...
X
తనను పోర్న్ స్టార్ అంటూ ఎన్నోసార్లు సంభోదించినప్పటికీ సన్నీలియోన్ ఎప్పుడూ బాధపడేలేదు. అప్పటి అనుభవాల్ని ఓ విలేకరి అడిగినప్పుడు కూడా సన్నీలియోన్ పెద్దగా చలించలేదు. తన గత చరిత్రకు సంబంధించి ఎన్నో విమర్శలు వచ్చినా ఆమె ధైర్యంగానే అన్నింటినీ ఎదుర్కొంది. కానీ ఒక్క ఉత్తరం.. ఒకే ఒక్క ఉత్తరం చదివిన తర్వాత మాత్రం సన్నీలియోన్ ఏడుపు ఆపుకోలేకపోయింది. అయితే అది బాధతో కాదు… ఆనంద బాష్పాలు. అవును… ఓ మహిళా అభిమాని రాసిన ఉత్తరం సన్నీని కదిలించింది.
ఇక ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా వాటన్నింటినీ భరిస్తూ ఇండియన్ సినీ ప్రపంచంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకోవడమే కాకుండా నటనపై తనకున్న ఇష్టంతో, హార్డ్ వర్క్ తో స్టార్ హీరోలు సైతం ఆమెతో నటిస్తామని చెప్పేలా పేరు సంపాదించింది. ఇలాంటి లైఫ్ స్టోరీతో తన ఫ్యాన్స్ ను అలరిస్తున్న సన్నీ గురించి ఇప్పుడు చెప్పుకోవడానికి కారణం.. ఓ హార్డ్ కోర్ ఫ్యాన్ ఇటీవల సన్నీకి ఓ లేఖ రాయడమే. ఆ లేఖలో సదరు అభిమాని.. సన్నీ ఇప్పటివరకు పడ్డ కష్టాలను, సంప్రదాయానికి నిలయమైన ఇండియాలో పోర్న్ స్టార్ ఇమేజ్ నుంచి బయటకొచ్చి ఈ స్థాయికి రావడటానికి ఆమె పడిన ఇబ్బందులు గుర్తుచేస్తూ సన్నీలియోన్ ను ప్రశంసల్లో ముంచెత్తింది. దీంతో ఈ లెటర్ ను చదివిన సన్నీలియోన్ తన గత స్మృతులను గుర్తుకుతెచ్చుకుని కంటతడి పెట్టుకుందట.
sunny
First Published:  16 Jun 2016 5:40 AM GMT
Next Story