Telugu Global
Cinema & Entertainment

తారక్ సినిమా ఆడియో వచ్చేది అప్పుడే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న జనతా గ్యారేజ్ చిత్ర ఆడియో వేడుక వచ్చే నెల 25న ఎన్టీఆర్ అభిమానుల సమక్షంలో హైదరాబాద్ లో భారీ ఎత్తున చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ముందుగా న్యూ జెర్సీ లో ఈ ఆడియో వేడుక ని భారీ ఎత్తున చేయాలనీ భావించారు కానీ అక్కడ కాకుండా హైదరాబాద్ లోనే చేయాలనీ ప్రస్తుతం భావిస్తున్నారట . ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో మలయాళ సూపర్ […]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న జనతా గ్యారేజ్ చిత్ర ఆడియో వేడుక వచ్చే నెల 25న ఎన్టీఆర్ అభిమానుల సమక్షంలో హైదరాబాద్ లో భారీ ఎత్తున చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ముందుగా న్యూ జెర్సీ లో ఈ ఆడియో వేడుక ని భారీ ఎత్తున చేయాలనీ భావించారు కానీ అక్కడ కాకుండా హైదరాబాద్ లోనే చేయాలనీ ప్రస్తుతం భావిస్తున్నారట . ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న విషయం తెలిసిందే . ఎన్టీఆర్ సరసన సమంత , నిత్యా మీనన్ లు నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 12న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో జనతా గ్యారేజీపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు దర్శకుడు కొరటాల శివ కూడా గత సినిమా శ్రీమంతుడుతో భారీ విజయాన్నందుకోవడంతో… తాజా చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి.
First Published:  19 Jun 2016 9:08 AM GMT
Next Story