మ‌ళ్లీ ఇష్క్ క‌ల‌యిక‌లో…! 

ఆరిపోతున్న  దీపానికి  ఆజ్యం పోసిన‌ట్లు.. నితిన్ కెరీర్ కు   ఇష్క్ చిత్రం ఆక్సిజ‌న్ పోసింది.   ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ చేసిన  ఇష్క్   నితిన్ ను  హీరోగా  నిల‌బెట్టింది. నిత్యామీన‌న్,  నితిన్ ల మ‌ధ్య అల్లిన  క్లీన్ అండ్ గ్రీన్  ల‌వ్ స్టోరి ఆడియ‌న్స్  హృద‌యాల్ని దోచుకుంది.  దీనికి తోడు పిసి శ్రీ‌రామ్ అందించిన సినిమాటోగ్ర‌ఫి  ప్రాణంగా నిలిచింది. 
ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ కూడా  సూర్య తో చేసిన 24 చిత్రం  స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తూ  ..త‌న త‌దుప‌రి చిత్రానికి క‌థ‌లు రాసుకుంటున్నాడ‌ని వినికిడి.  ఆయ‌న కూడా నితిన్ తో చేయ‌డానికి  ఆస‌క్తి చూపుతున్న‌ట్టు టాక్.  అయితే పెద్ద  హీరోల డే్ట్స్  అడ్జెస్ట్ అయితే మాత్రం ఫ‌స్ట్  వాళ్ల‌తోనే చిత్రం వుంటుదనే  టాక్ కూడా వినిపిస్తుంది.  ఎవ‌రి డేట్స్ దొర‌క్క పోతే మాత్రం మ‌రో  ఇష్క్  లాంటి చిత్రాన్ని చూడోచ్చ‌ట‌.