వేలాడుతున్న మృత‌దేహంతోనే… రైలు వెళ్లింది!

అత్యంత దారుణ‌మైన విషాదం ఇది. విశాఖ జిల్లా అనాకాప‌ల్లి ద‌గ్గ‌ర‌లోని శార‌దా న‌ది వంతెన వ‌ద్ద ప‌ట్టాలు దాటుతున్న  పాతికేళ్ల యువ‌కుడుని రైలు ఢీ కొట్టింది. అత‌ను మ‌ర‌ణించ‌గా, మృత‌దేహం ఇంజ‌నుకి ముందు ఇనుప‌కొక్కెంలో  చిక్కుకుపోయింది. క‌న్యాకుమారి నుండి హౌరా వెళుతున్న ఆ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్  వేలాడుతున్న మృత‌దేహంతోనే త‌రువాత స్టేష‌ను వ‌ర‌కు వెళ్లిపోయింది. అన‌కాప‌ల్లి స్టేష‌న్ వ‌చ్చాక డ్రైవ‌ర్ రైలుని ఆపాడు. అక్క‌డి సిబ్బంది స‌హాయంతో శ‌వాన్ని తొల‌గించి, ముందుకు వెళ్లాడు. ఈ స్టేష‌న్లో రైలుకి హాల్ట్ లేదు.