Telugu Global
Cinema & Entertainment

సోనమ్ కపూర్ మరో కొత్త అవతారం...

తనలో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో అన్నీ చూపించడానికి సిద్ధమౌతోంది సోనమ్ కపూర్. అనీల్ గారాల పట్టిగా పరిశ్రమకొచ్చిన ఈ ముద్దుగుమ్మ… తర్వాత నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత ఫ్యాషన్ ఐకాన్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నటి, ఫ్యాషన్ ఐకాన్, మోడల్ గా వివిధ పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటోంది. మధ్యమధ్యలో తనలోని డ్రాయింగ్ టాలెంట్ ను కూడా చూపిస్తుంటుంది. ఖాళీ సమయాల్లో ఇంట్లో ఉన్నప్పుడు బొమ్మలు గీస్తుంటుంది సోనమ్. ఆ […]

సోనమ్ కపూర్ మరో కొత్త అవతారం...
X
తనలో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో అన్నీ చూపించడానికి సిద్ధమౌతోంది సోనమ్ కపూర్. అనీల్ గారాల పట్టిగా పరిశ్రమకొచ్చిన ఈ ముద్దుగుమ్మ… తర్వాత నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత ఫ్యాషన్ ఐకాన్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నటి, ఫ్యాషన్ ఐకాన్, మోడల్ గా వివిధ పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటోంది. మధ్యమధ్యలో తనలోని డ్రాయింగ్ టాలెంట్ ను కూడా చూపిస్తుంటుంది. ఖాళీ సమయాల్లో ఇంట్లో ఉన్నప్పుడు బొమ్మలు గీస్తుంటుంది సోనమ్. ఆ ఫొటోల్ని అప్పుడప్పుడు నెట్ లో పెడుతుంటుంది. ఈ అవతారాలన్నీ అభిమానులకు తెలిసినవే. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా మరో యాంగిల్ ను చూపిస్తోంది ఈ స్లిమ్ బ్యూటీ. త్వరలోనే ఈమె ఓ యాప్ ను స్టార్ట్ చేస్తుందట.
సోనమ్ కు పుస్తకాలు చదవడం అలవాటు. ఎక్కడ, ఎప్పుడు ఖాళీ దొరికినా ఏదో ఒక పుస్తకం పట్టుకొని కూర్చుంటుంది. ఈమధ్య తన పుట్టినరోజుకు కూడా ఇలానే వందలాది పుస్తకాల్ని బహుమతులుగా అందుకుందట. ప్రస్తుతం తన దగ్గర ఓ వెయ్యి వరకు పుస్తకాలు ఉన్నాయని చెబుతోంది సోనమ్ కపూర్. ఈ పుస్తకాల్లో తను చదివిన పుస్తకాలకు సంబంధించి సమీక్షలు (రివ్యూలు) రాస్తానని ప్రకటించింది. అలా రాసిన రివ్యూలతో ఓ యాప్ ను ప్రారంభించే ఆలోచనలో ఉందట సోనమ్. ఇకపై సోనమ్ వ్యూస్ ను కూడా పరిశీలించవచ్చన్నమాట.
First Published:  20 Jun 2016 7:40 AM GMT
Next Story