Telugu Global
NEWS

కోదండ‌రాం మాట‌ల‌పై తెలంగాణ స‌ర్కారు మౌనం!

కాంట్రాక్టుల తెలంగాణ‌ను ప్ర‌జ‌లు కోరుకోలేద‌ని, జ‌య‌శంక‌ర్‌ని తెలంగాణ జాతి పిత‌గా ప్ర‌క‌టించాల‌ని తెలంగాణ జేఏసీ కోదండ‌రాం డిమాండ్ చేశారు. ఫ్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ ఐద‌వ‌ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. కాంట్రాక్టుల కోసం కాద‌ని, ప్ర‌జ‌లు, విద్యార్థులు, నిరుద్యోగులు సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. బ‌డుగు బలహీన వ‌ర్గాల అభివృద్ధికి జేఏసీ నిరంత‌రం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. కోదండ‌రాం మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, డిమాండ్లు చేసినా తెలంగాణ స‌ర్కారు నుంచి ఎలాంటి ప్ర‌తి విమర్శ […]

కోదండ‌రాం మాట‌ల‌పై తెలంగాణ స‌ర్కారు మౌనం!
X
కాంట్రాక్టుల తెలంగాణ‌ను ప్ర‌జ‌లు కోరుకోలేద‌ని, జ‌య‌శంక‌ర్‌ని తెలంగాణ జాతి పిత‌గా ప్ర‌క‌టించాల‌ని తెలంగాణ జేఏసీ కోదండ‌రాం డిమాండ్ చేశారు. ఫ్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ ఐద‌వ‌ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. కాంట్రాక్టుల కోసం కాద‌ని, ప్ర‌జ‌లు, విద్యార్థులు, నిరుద్యోగులు సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. బ‌డుగు బలహీన వ‌ర్గాల అభివృద్ధికి జేఏసీ నిరంత‌రం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. కోదండ‌రాం మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు, డిమాండ్లు చేసినా తెలంగాణ స‌ర్కారు నుంచి ఎలాంటి ప్ర‌తి విమర్శ రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.
మొన్న‌టికి మొన్న కోదండ‌రాంపై దాదాపు తెలంగాణ మంత్రులంతా వ‌రుసగా ప్రెస్‌మీట్లు పెట్టి కోదండ‌రాం వ్యాఖ్య‌ల్ని ఖండ‌ఖండాలుగా ఖండించిన సంగ‌తి తెలిసిందే. అయితే, రెండోసారి స‌ర్కారు ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై మౌనం వ‌హించింది. ఈ ప‌రిణామం ప్ర‌తిప‌క్షాల‌కు, రాజ‌కీయ విశ్లేష‌కుల‌కు కాస్త ఆశ్చ‌ర్యం క‌లిగించింది. మొన్న‌టికి మొన్న కోదండ‌రాంపై మూకుమ్మ‌డి దాడి చేసిన కేసీఆర్ దండు ఇప్పుడు ఇలా మౌనం వ‌హించ‌డం వ్య‌హాత్మ‌కమ ప‌రిణామం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇటీవ‌ల‌ కోదండ‌రాం చేసిన వ్యాఖ్య‌ల కంటే మంత్రివ‌ర్గం చేసిన ప్ర‌తిఆరోప‌ణ‌లు ప్ర‌భుత్వాన్ని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేశాయ‌నే చెప్పాలి. ప్ర‌తిపక్షాల‌కు వెర‌వ‌ని ప్ర‌భుత్వం కోదండ‌రాం వ్యాఖ్య‌ల‌కు భుజాలు త‌డుముకుంటోంద‌ని మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.
అందుకే, తాజాగా కోదండ‌రాం చేసిన వ్యాఖ్య‌ల‌పై ఎవ‌రూ నోరుమెద‌ప‌డం లేదు. ప్ర‌తివిమ‌ర్శ చేసి ఆయ‌న‌కు ప్ర‌చారం క‌ల్పించ‌డం కంటే.. ఏమీ అన‌కుండా ఉండ‌ట‌మే మేల‌న్న బాట‌లో స‌ర్కారు సాగుతోంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నాకు వ‌చ్చారు. అందుకే, జేఏసీ కార్య‌క్ర‌మాల‌ను, కోదండ‌రాం వ్యాఖ్య‌ల‌ను కేసీఆర్ స‌హా, మంత్రులంతా లైట్ తీసుకుంటున్నారు.
First Published:  21 Jun 2016 11:07 PM GMT
Next Story