Telugu Global
Cinema & Entertainment

మరికొన్ని రోజుల్లో తెలుగులో కబాలి రచ్చ

కబాలి సినిమా తమిళ పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. తమిళ తంబీలు ఈ సాంగ్స్ తో పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడీ పాటలు తెలుగులో కూడా హల్ చల్ చేయబోతున్నాయి. ఈనెల 26న అంటే సరిగ్గా మరో 4 రోజుల్లో… కబాలి తెలుగు సాంగ్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. పి.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాఫియా డాన్ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. నెరెప్పుడా అనే పాట ప్రస్తుతం కోలీవుడ్ ను ఊపేస్తోంది. పాట తమిళ్ లో ఉన్నప్పటికీ తెలుగు […]

మరికొన్ని రోజుల్లో తెలుగులో కబాలి రచ్చ
X
కబాలి సినిమా తమిళ పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. తమిళ తంబీలు ఈ సాంగ్స్ తో పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడీ పాటలు తెలుగులో కూడా హల్ చల్ చేయబోతున్నాయి. ఈనెల 26న అంటే సరిగ్గా మరో 4 రోజుల్లో… కబాలి తెలుగు సాంగ్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. పి.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాఫియా డాన్ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. నెరెప్పుడా అనే పాట ప్రస్తుతం కోలీవుడ్ ను ఊపేస్తోంది. పాట తమిళ్ లో ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సాంగ్ కు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ పాట తెలుగులో విడుదలైతే ఇంకెంత సెన్సేషన్ సృష్టిస్తుందోనని అంతా ఎదురుచూస్తున్నారు. రాధికా ఆప్టే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే… బాషా సినిమా తర్వాత రజనీకాంత్ పూర్తిస్థాయిలో మాఫియా డాన్ గా కనిపించిన సినిమా కబాలి మాత్రమే. పైగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అందుకే కబాలి ఈసారి అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. తెలుగు, తమిళ భాషలతో పాటు దాదాపు 10 భాషల్లో జులై నెలలో కబాలి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
First Published:  21 Jun 2016 10:43 PM GMT
Next Story